తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Free Train: అయోధ్య రామ మందిర ప్రారంభం.. తెలంగాణ నుంచి ఉచిత రైలు

దేశ ప్రజలంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభించేందుకు మరికొంత సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా రామ నామ సంకీర్తనలు మారుమోగుతున్నాయి. అయోధ్యలోని ఆ రామయ్యను దర్శించుకునేందుకు తమకెప్పుడు ఆ భాగ్యం కలుగుుతుందో అని ప్రజలంతా తహతహలాడుతున్నారు. ఈ క్రమంలోనే అయోధ్యకు వెళ్లాలనుకునే భక్తులకు బీజేపీ నేతలు గుడ్ న్యూస్ చెప్పారు.

Also read: Swamy Nithyananda: అయోధ్య రామయ్య దర్శనానికి ఆహ్వానం వచ్చింది.. నిత్యానంద వెల్లడి

నల్లగొండ నుంచి అయోధ్య వరకు ఫ్రీ ట్రైన్ ను నడపనున్నట్టు నల్లగొండ బీజేపీ ఇంఛార్జీ వర్షిత్ రెడ్డి చెప్పారు. ఫిబ్రవరి 4న నల్లగొండ రైల్వేస్టేషన్ నుంచి ఈ రైలు బయల్దేరుతుందని అన్నారు. 14 వందల మందితో ఈ ట్రైన్ వెళ్లబోతున్నట్టు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి మొదటి వారంలో నల్లగొండకు రానున్నట్టు చెప్పారు. ఆయన చేతుల మీదుగానే ఈ రైలును ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ రైలు రాముడి భక్తలకు ఒక గిఫ్ట్ లాంటిదని వర్షిత్ రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button