తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

MoUs: ఏపీకి కంపెనీల క్యూ.. ఫలిస్తున్న గ్లోబల్ సమ్మిట్ ఒప్పందాలు

విశాఖపట్టణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఫలాలు ఆంధ్రప్రదేశ్ కు దక్కుతున్నాయి. ఆ సదస్సులో చేసుకున్న ఒప్పందాలు కార్యరూపం దాల్చుతున్నాయి. సమ్మిట్ పై ప్రతిపక్షాలు చేసిన విమర్శలు తప్పని రుజువు చేస్తున్నాయి. ఆ సదస్సులో చేసుకున్న 13 ఒప్పందాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.

Also Read సింగరేణి ఎన్నికల్లో ఎర్రజెండా రెపరెపలు.. పత్తా లేని బీఆర్ఎస్ పార్టీ

సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ ఏడాది మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్టణం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అట్టహాసంగా జరిగింది. ప్రపంచ నలుమూలలా నుంచి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు తరలివచ్చారు. రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో రూ.13 లక్షల కోట్ల విలువైన 352 ఒప్పందాలు జరిగాయి. రిలయన్స్, అదానీ తదితర దిగ్గజ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఆ సదస్సులో ఒప్పందం చేసుకున్న కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి.

ఒప్పందం చేసుకున్న 13 కంపెనీలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయి. మరికొన్ని త్వరలోనే తమ కార్యాలయాలను ప్రారంభించి పనులు మొదలుపెట్టనున్నాయి. జనవరి 2024లోపు 38 కంపెనీలు పనులు ప్రారంభించనున్నాయి. మరో 30 కంపెనీలు మార్చిలోపు పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

చదవండి: అంగన్ వాడీ కార్యకర్తలకు హెచ్చరిస్తూనే ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి

ఏపీ పారిశ్రామిక రంగంలో విశాఖ సదస్సు కీలక పాత్ర పోషిస్తోంది. ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. కొన్ని కంపెనీల డీపీఆర్ లు ఆమోదం పొందాల్సి ఉంది. ఆమోదం పొందిన మరికొన్ని కంపెనీలు కార్యాలయాల అన్వేషణలో ఉన్నాయి. సౌర, శక్తి తదితర రంగాల్లో అత్యధిక పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే. ఇక నౌకాశ్రయ రంగంలో భారీ పెట్టుబడులు వచ్చాయి. అవన్నీ కార్యరూపం దాలిస్తే ఏపీలో పరిశ్రమలు పరుగులు పెట్టనున్నాయి.

పారిశ్రామిక అభివృద్ధికి ఇంతలా సీఎం జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం అసత్య ప్రచారాలు చేస్తున్నాయి. జగన్ రావడంతో ఉన్న కంపెనీలు ఏపీని వదిలి పారిపోతున్నాయని ఆరోపణలు చేస్తున్నాయి. కానీ వారు చేసే ప్రచారం అవాస్తవమని విశాఖ సదస్సులో జరిగిన ఒప్పందాలే నిదర్శనమని పేర్కొంటున్నారు. పెద్ద ఎత్తున కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభిస్తే ఏపీ యువతకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సీఎం జగన్ పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని చెప్పడానికి ఈ కంపెనీలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button