తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Pending Challans: బిగ్ అలర్ట్.. చలాన్లకు ఇంకా మూడురోజులే!

పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్​చలాన్ల చెల్లింపులకు తెలంగాణ సర్కార్ ఇటీవల భారీ డిస్కౌంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రకటించిన ఈ​ ఆఫర్ ఈనెల 31వ తేదీతో ముగియనుంది. అయితే మరో మూడు రోజుల్లో ఈ గడువు ముగియనుండడంతో వాహనదారులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. మొదట గడువు పెంచామని, ఈసారి గడువు పెంచేది లేదని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

ALSO READ: గుడ్ న్యూస్..రేషన్‌కార్డు ఈ-కేవైసీ గడువు పొడగింపు

పది రోజుల్లోనే రూ.135 కోట్ల ఆదాయం

రాష్ట్రంలో 3.5 కోట్లకు పైగా ట్రాఫిక్​చలాన్లు పెండింగ్‌లో ఉండడంతో పోలీసు ఉన్నతాధికారులు మొదట జనవరి 10వ తేదీ వరకు ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి చలాన్లపై 90 శాతం రాయితీ, ద్విచక్రవాహనాల చలాన్లకు 80 శాతం రాయితీ, ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం, లారీలతో పాటు ఇతర హెవీ వెహికిల్స్‌కు 50 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. దీంతో మొదటి పది రోజుల్లోనే రూ.135 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో ఈ ​ఆఫర్‌ను జనవరి చివరి వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button