తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

BRS Party: కేసీఆర్ రంగంలోకి దిగితే సీన్ సితారే: కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ హెచ్చరిక

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలు తెలుసుకుని సార్వత్రిక ఎన్నికల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దొంగ హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ను హరీశ్ తాను చెడుగుడు ఆడుకున్నామని చెప్పారు. ఇక పార్టీ అధినేత కేసీఆర్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేరని పేర్కొన్నారు. కాంగ్రెస్ కు అసలైన సినిమా ముందుంది అని హెచ్చచించారు.

చదవండి: కాంగ్రెస్‌కు ప్రజలంటే రాజకీయం, బీఆర్ఎస్‌కు బాధ్యత: హరీశ్ రావు

హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో శుక్రవారం భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ పై చర్చించారు. ఈసారి భువనగిరిలో గులాబీ జెండా ఎగురవేయడంపై పార్టీ నాయకులతో కేటీఆర్ చర్చలు జరిపారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ప్రజలు తప్పు చేశారని అనడం సరైనది కాదు. పార్టీ నాయకులు అలా మాట్లాడవద్దని సూచించారు. మనల్ని రెండు సార్లు గెలిపించనది కూడా ప్రజలేనని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పూర్తి తిరస్కరించలేదని.. దానికి చాలా చోట్ల స్వల్ప తేడాతోనే ఓడిపోయామని వివరించారు. ఓటమిని సమీక్షించుకుని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొందామని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

చదవండి: బీజేపీకి దెబ్బ మీద దెబ్బ.. సినీనటి జయసుధ పార్టీని వీడనున్నారా?

కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించాలని అనుకుంటుంటే కాంగ్రెస్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. అధికారం కోసం అడ్డమైన హామీలిచ్చి ఇవ్వాళ అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో రైతుబంధు రాక, విద్యుత్ కోతలతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఓటమి మనకు కొత్తేంద కాదని.. అది స్పీడ్ బ్రేకర్ వంటిదేనని పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button