తెలుగు
te తెలుగు en English
క్రికెట్

NZ VS PAK: డారిల్ మిచెల్ విధ్వంసం… న్యూజిలాండ్ చేతిలో పాకిస్తాన్ ఓటమి

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టీ20లో న్యూజిలాండ్‌ భారీ స్కోర్‌ చేసింది. డారిల్‌ మిచెల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ (27 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడి కివీస్‌ భారీ స్కోర్‌ చేయడంలో కీలకపాత్ర పోషించగా.. 417 రోజుల తర్వాత టీ20 మ్యాచ్‌ ఆడుతున్న కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీతో (57) రాణించాడు.

Also Read: టీమిండియా జెర్సీలు మారనున్నాయి… ఎందుకంటే?

ఇన్నింగ్స్‌ ఆరంభంలో ఫిన్‌ అలెన్‌ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆఖర్లో మార్క్‌ చాప్‌మన్‌ (11 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కివీస్‌ ఇన్నింగ్స్‌లో డెవాన్‌ కాన్వే, ఐష్‌ సోధి డకౌట్లు కాగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ 19, ఆడమ్‌ మిల్నే 10 పరుగులు చేశారు. మ్యాట్‌ హెన్రీ 0, టిమ్‌ సౌథీ 6 పరుగులతో అజేయంగా నిలిచారు.

Also Read:  ఆసియా టీమ్ చాంపియ‌న్‌షిప్స్‌… ఆటగాళ్ల జాబితా ప్రకటన

అనంత‌రం భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో సౌథీ, సోధీ దెబ్బ‌కు పాక్ మిడిలార్డ‌ర్ త‌డ‌బ‌డింది. ఒక‌వైపు వికెట్లు ప‌డుతున్నా మాజీ కెప్టెన్ బాబ‌ర్ ఆజాం(57) ఒంటరి పోరాటం చేశాడు. కానీ.. సౌథీ 18వ ఓవ‌ర్లో అబ్బాస్ అఫ్రిది(1), హ్యారిస్ రౌఫ్‌(0)ల‌ను ఔట్ చేయ‌డంతో 180 ప‌రుగుల వ‌ద్ద‌ పాక్ ఇన్నింగ్స్ ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button