తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

BRS Party: కాంగ్రెస్‌కు ప్రజలంటే రాజకీయం, బీఆర్ఎస్‌కు బాధ్యత: హరీశ్ రావు

తాము ఓడిపోయినంత మాత్రాన ప్రజలను వదిలేసేది లేదని… వారి పక్షాన పోరాడతామని… ప్రజలే తమకు దేవుళ్లని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదని… తెలంగాణ నుంచి కేసీఆర్‌ను ఎవరూ వేరు చేయలేరని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి… చావునోట్లో తల పెట్టి తెలంగాణను సాధించారన్నారు.

Also Read: బీజేపీకి దెబ్బ మీద దెబ్బ.. సినీనటి జయసుధ పార్టీని వీడనున్నారా?

తెలంగాణ రావడం వల్లే నీళ్లు… నిధులు.. నియామకాలు వచ్చాయన్నారు. తెలంగాణ రావడం వల్లే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలు వచ్చాయన్నారు. వీటన్నింటికి కారణం కేసీఆర్ అని గుర్తుంచుకోవాలన్నారు. అయితే ప్రజాతీర్పును అంగీకరిస్తూ బీఆర్ఎస్ పార్టీకి వేసిన ప్రతి ఓటు కోసం కృతజ్ఞతతో పని చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు.

Also Read: కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగుల ఆగ్రహం.. ప్రజా భవన్ లో ఆందోళన

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని… గజ్వేల్‌ డెవలప్‌మెంట్ అథారిటీని రద్దు చేశారని అక్కడ జరిగే అభివృద్ధిని కక్షతో అడ్డుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు ప్రజలంటే రాజకీయం, బీఆర్ఎస్‌కు ప్రజలంటే బాధ్యతని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీలో కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టంచేశారు. ఎన్నికల హామీల అమలు కోసం ప్రజల పక్షాన అసెంబ్లీలో పోరాడతామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button