తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

RAM Trailer: దేశభక్తి చిత్రంగా “రామ్” మూవీ… ట్రైలర్ రిలీజ్

దేశభక్తిని చాటి చెప్పే చిత్రంగా రామ్‌ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీతో మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు.

Also Read: ఏంది అట్టా చూస్తున్నావ్.. బీడీ త్రీడీలో కనపడుతుందా?

దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయజుల హీరోగా పరిచయం కానున్నారు. ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్లు, పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. సైంధవ్ డైరెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను విడుదల చేశారు.

Also Read: ఫైట్స్ చేస్తూ గాయపడ్డ హీరో నితిన్.. ‘తమ్ముడు’కి మూడు వారాలు విశ్రాంతి

ఈ మూవీలో దేశ భక్తిని చాటే డైలాగ్స్ చాలా ఉన్నాయని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ట్రైలర్‌లోని సన్నివేశాలు చూస్తే ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. కాగా.. ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆశ్రిత్ అయ్యంగార్ సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button