తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

BRS Party: ఎంతో చేశాం.. కానీ చెప్పుకోలేక ఓడిపోయాం: కేటీఆర్

పదేళ్లలో తెలంగాణను అగ్రభాగాన నిలబెట్టాం కానీ అది ప్రజలకు చెప్పుకోలేకపోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. చేసింది చెప్పుకోలేకపోవడంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుడు ప్రచారాన్ని నమ్మి ప్రజలు గొప్పగా పని చేసిన నాయకులను కూడా తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో గురువారం ‘మహబూబాబాద్’ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.

Also Read హైకోర్టుకు 100 ఎకరాలు కేటాయింపు.. అగ్గిరవ్వగా మారిన అగ్రికల్చర్ వర్సిటీ

‘ప్రజలు మనకు పదేళ్లు అవకాశం ఇచ్చారు. అధికారంలోకి వస్తాం అని కాంగ్రెస్ పార్టీ అనుకోలేదు. నోటికి ఏది వస్తే అది హామి అని చెప్పారు. ఆరు గ్యారెంటీలు అన్నారు. కానీ 420 హమీలిచ్చింది కాంగ్రెస్ వాళ్ల తప్పుడు ప్రచారం నమ్మి ప్రజలు గొప్పగా పని చేసిన నాయకులను కూడా తిరస్కరించారు’ అని పేర్కొన్నారు. రేషన్ కార్డుల విషయంలోనూ తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. ‘ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ప్రచారం చేశారు. కానీ తొమ్మిదిన్నరేళ్లలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చింది’ అని కేటీఆర్ ప్రకటించారు.

Also Read ఫైట్స్ చేస్తూ గాయపడ్డ హీరో నితిన్.. ‘తమ్ముడు’కి మూడు వారాలు విశ్రాంతి

‘దేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది మన ప్రభుత్వం. మేము ఏనాడు చెప్పుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇచ్చింది మన ప్రభుత్వం కానీ మేము చెప్పుకోలేదు, ప్రచారం చేస్కోలేదు. దేశంలో అందరికన్నా ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులకు 73% జీతాలు పెంచిన ఏకైక నాయకుడు కేసీఆర్ 29 లక్షల ఫించన్లను 46 లక్షలకు పెంచినా ఏనాడు చెప్పుకోలేదు. దేశంలో అందరికన్నా ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button