తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Protest: హైకోర్టుకు 100 ఎకరాలు కేటాయింపు.. అగ్గిరవ్వగా మారిన అగ్రికల్చర్ వర్సిటీ

తెలంగాణలో సరికొత్త ఆందోళనకు తెరలేచింది. హైకోర్టు నిర్మాణానికి కేటాయించిన వంద ఎకరాల భూమిపై తీవ్ర వివాదం నెలకొంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయానికి చెందిన భూములు కేటాయించారు. పుపై విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వర్సిటీకి తీవ్ర నష్టం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మూడు రోజులుగా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ధర్నా, రాస్తారోకో వంటి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. వారికి పలు విద్యార్థి సంఘాల నాయకులు మద్దతుగా నిలుస్తూ ఆందోళనల్లో పాల్గొంటున్నారు.

Also Read ఎంపీ ఎన్నికల వేళ బీజేపీకి భారీ షాక్.. యువ నాయకుడు రాజీనామా

కొత్త హైకోర్టు నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 31న జీవో 55ను జారీ చేసింది. వ్యవసాయ శాఖకు చెందిన వంద ఎకరాల భూమిని న్యాయ శాఖకు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఆ భూమి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ప్రేమావతిపేట్, బుద్వేల్ గ్రామాల పరిధిలో ఉంది. వీటిలో దాదాపు 57.50 ఎకరాల భూమి ఈ రెండు విశ్వవిద్యాలయాకు చెందినది ఉంది. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ముందే అరకొర వసతులు, సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు భూమి లాగేసుకుంటే ఎలా అని మేధవులు ప్రశ్నిస్తున్నారు.

Also Read  ప్రజలు కోరుకున్న మార్పు చేసి చూపిస్తాం: శ్రీధర్ బాబు

కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వర్సిటీకి మేలు చేయాల్సింది పోయి కీడు చేస్తోందని వర్సిటీ విద్యార్థులు మండిపడుతున్నారు. హైకోర్టుకు కేటాయించిన భూములు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు రోజులుగా చేపడుతున్న ఉద్యమంలో భాగంగా బుధవారం రాత్రి విద్యార్థులు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. వర్సిటీలోని ఓ కూడలిలో విద్యార్థులంతా కొవ్వొత్తులు చేతబూని నిరసన వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వం భూముల కేటాయింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి’ అని నినాదాలు చేశారు. వీరి ఆందోళనకు వివిధ విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకునేదాకా తమ ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్ లో ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button