తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Shooting: ఫైట్స్ చేస్తూ గాయపడ్డ హీరో నితిన్.. ‘తమ్ముడు’కి మూడు వారాలు విశ్రాంతి

సినిమా షూటింగ్ లో హీరో నితిన్ గాయపడినట్లు సమాచారం. ఫైటింగ్ సీన్లలో నితిన్ కు గాయాలయ్యాయని.. మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ ‘తమ్ముడు’ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తున్నారు.

Also Read మాస్‌ లుక్ లో అశోక్ గల్లా… దేవకీ నందన వాసుదేవ టీజర్‌ రిలీజ్

షూటింగ్ చేస్తున్న సమయంలో పొరపాటున నితిన్ గాయపడ్డారు. తక్షణం స్పందించిన చిత్రబృందం వెంటనే నితిన్ ను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. చికిత్స అందించిన వైద్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు. కాకపోతే మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి.

Also Read  వినోదాత్మకంగా ’నా సామిరంగ‘ ట్రైలర్.. సంక్రాంతికి నాగార్జున గట్టిపోటీనే

గతేడాది నితిన్, శ్రీలలతో కలిసి నటించిన ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాతో వచ్చారు. కానీ ఆ చిత్రం ఆశించిన ఫలితం కనిపించలేదు. కొన్నేళ్లుగా హిట్ కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్న నితిన్ ‘తమ్ముడు’ సినిమాలపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. పైగా తన అభిమాన హీరో పవన్ కల్యాణ్ సినిమా పేరు ‘తమ్ముడు’ను వాడుకుంటుండడంతో తనకు అలాంటి హిట్ వస్తుందని నితిన్ భావిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button