తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Prabhas: ప్రభాస్ కల్కి 2898 AD… అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చేసింది. నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898 AD సినిమా రిలీజ్ పై క్లారిటీ వచ్చేసింది. తాజాగా ఈ సినిమా విడుదల డేట్ ను ప్రకటించారు మేకర్స్. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టుగానే.. కల్కి సినిమా రిలీజ్ విషయంలో మెగాస్టార్ సెంటిమెంట్ ను వాడేశారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై వచ్చి సూపర్ హిట్ అయినా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజైన మే 9న కల్కి ని కూడా రిలీజ్ చేయనున్నారు. “ఆరు వేల ఏళ్ల కిందట పూర్తయిన కథ మే 9, 2024 న ప్రారంభం కాబోతోంది” అనే క్యాప్షన్ తో ఈ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

Also Read: దేశభక్తి చిత్రంగా “రామ్” మూవీ… ట్రైలర్ రిలీజ్

ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఈ సందర్బంగా కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ లుక్ నెక్స్ట్ లెవల్లో ఉంది. ఆ లుక్ కల్కి సినిమాపై అంచనాలు పెంచుతోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ఈ మూవీలో నటిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటాని నటిస్తుండగా.. లోకనాయకుడు కమల్ హాసన్ విలన్ రోల్ లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

Also Read:  ఫైట్స్ చేస్తూ గాయపడ్డ హీరో నితిన్.. ‘తమ్ముడు’కి మూడు వారాలు విశ్రాంతి

600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ కల్కి 2898 ఏడీ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ కోసమే భారీగా ఖర్చు చేశారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం సలార్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు అతని నెక్ట్స్ మూవీ రిలీజ్ డేట్ కూడా తెలియడంతో వాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక ప్రభాస్ డైరెక్టర్ మారుతితో చేస్తున్న మూవీ అప్డేట్ కూడా సంక్రాంతి సందర్భంగానే ఇవ్వనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button