తెలుగు
te తెలుగు en English
జాతీయం

Maharashtra: కాలారామ్ మందిరంలో రాములవారి భజన చేసిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర నాసిక్ లోని ప్రాచీన కాలారామ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలోకి వెళ్లిన మోదీ.. స్వచ్ఛ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. నీళ్లను మోసుకెళ్లి తడిబట్టతో ఆలయ ప్రాంగణాన్ని తుడిచారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం జరిగే జనవరి 22 వరకు ప్రతిరోజు ఆలయాలన్నింటిని పరిశుభ్రంగా ఉంచాలంటూ మోదీ పిలుపునిచ్చారు. మోదీ ఆలయం శుభ్రం చేసిన వీడియోలు , ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Also Read: కాంగ్రెస్‌కు ప్రజలంటే రాజకీయం, బీఆర్ఎస్‌కు బాధ్యత: హరీశ్ రావు

అనంతరం మోదీ పంచవటి పరిసరాల్లో ఉన్న కాలారామ్ మందిరంలో రాములవారి భజనలో పాల్గొన్నారు. మోదీ ఆలయంలో కూర్చొని తాళాలు వాయించాడు. ఒక సంగీత వాయిద్యంతో పలువురు పూజారులు రామ్ భజన పాడారు. అనంతరం మోదీ 11 రోజుల పాటు జరిగే అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్టోత్సవాలను ప్రారంభించారు. ఈ చారిత్రక శుభకరమైన సందర్భం తన హయాంలో జరగడం అదృష్ణంగా భావిస్తున్నట్లు మోదీ చెప్పారు.

Also Read: విజయనగరానికి అశోక్ గజపతి రాజు చేసిందేమిటి?… ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ప్రజలు

నాసిక్‌ రావడం సంతోషంగా ఉందని మోదీ తెలిపారు. పంచవటి ప్రాంతంలో సీతారాములు గడిపారన్న నమ్మకం ఉందని చెప్పారు. రాముడు చాలాకాలంపాటు పంచవటిలో ఉన్నారన్నారు. అనంతరం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా తపోవన్ గ్రౌండ్‌లో నేషనల్‌ యూత్‌ ఫెస్టివల్‌ను మోదీ ప్రారంభించారు. దేశంలో యువశక్తి అత్యంత ముఖ్యమైందని.. దేశ లక్ష్యాలను చేరుకోవడంలో యువత బలమైన మనస్తత్వం మీదే ఆధారపడి ఉంటుందని చెప్పారు. ప్రపంచంలోనే భారత్‌ అతిపెద్ద ఐదో ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని… టెక్నాలజీ రంగంలో భారత్‌ వృద్ధి చెందుతోందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button