తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Tantra: ‘తంత్ర’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అనన్య నాగిళ్ల ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘తంత్ర’. క్షుద్రపూజల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 15న రిలీజైంది. అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ఇది స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి తాజాగా ఆహా సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 5 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు.

ALSO READ:  కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ‘టిల్లు స్క్వేర్’

ఫస్ట్ లుక్ దగ్గర నుండి ఈ సినిమాలో ఏ రేంజ్ హారర్ ఉండబోతుందో హింట్స్ ఇస్తూనే ఉన్నారు మేకర్స్. అందుకే ఈ మూవీకి ‘ఏ’ సర్టిఫికెట్ కూడా వచ్చింది. హారర్ లవర్స్‌కు ఈ మూవీ గురించి తెలియడం కోసం మూవీ టీమ్ అంతా ఓ రేంజ్‌లో ప్రమోషన్స్ చేసింది. కానీ థియేటర్లలో పెద్దగా రాణించలేకపోయింది. ఫీమేల్ ఓరియెంటెడ్ హారర్ చిత్రంగా తెరకెక్కిన ‘తంత్ర’ను శ్రీనివాస్ గోపిశెట్టి డైరెక్ట్ చేశారు. ఈ మూవీ అనన్యతో పాటు ధనుష్ రఘుముద్రి,సలోని,టెంపర్ వంశీ,మీసాల లక్ష్మణ్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు.

8 Comments

  1. I loved as much as you will receive carried out right
    here. The sketch is tasteful, your authored material stylish.
    nonetheless, you command get got an nervousness over that you wish
    be delivering the following. unwell unquestionably come further formerly again since exactly the same nearly very often inside case you
    shield this increase.

    Also visit my web site :: nordvpn special coupon code 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button