తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

TDP: నర్సీపట్నం శంఖారావం సభ… జగన్ పై ధ్వజమెత్తిన లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నిర్వహించిన శంఖారావం సభకు హాజరయ్యారు. తనను, చంద్రబాబును, పవన్ కల్యాణ్ ను తిడితేనే వైఎస్ఆర్సీపీలో టికెట్లు ఇస్తారంట… తిట్టని వాళ్లకు నో టికెట్! అంటూ వ్యాఖ్యానించారు.

Also Read: నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ… పలు కీలక అంశాలపై చర్చ

టీడీపీ వర్గాలు జనసైనికులను తిడుతున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇరు పార్టీల వారు అప్రమత్తంగా ఉండాలని లోకేశ్ స్పష్టం చేశారు. తమ మధ్య గొడవలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తమందరం ఒకే నినాదానికి కట్టుబడి ఉండాలని… హలో ఏపీ.. బై బై వైఎస్ఆర్సీపీ అనే నినాదానికి కట్టుబడి ఉండాలని లోకేశ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో లోకేశ్ సీఎం జగన్ పైనా ధ్వజమెత్తారు. జగన్ లక్ష కోట్ల ఆస్తులున్న ఒక పేదవాడు అని వ్యంగ్యం ప్రదర్శించారు.ఈసారి ఎన్నికల్లో జగన్ అహంకారానికి, తెలుగువాడి ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం అని నారా లోకేశ్ స్పష్టం చేశారు. తాము ప్రజల్లో ఉంటాం… జగన్ పరదాలు కట్టుకుని తిరుగుతాడని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button