తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

SCCL: సింగరేణి ఎన్నికల్లో ఎర్రజెండా రెపరెపలు.. పత్తా లేని బీఆర్ఎస్

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎర్ర జెండా రెపరెపలాడింది. బొగ్గు గని కార్మికులు నక్షత్రం గుర్తుకు ఓట్లు గుద్దేశారు. అత్యంత ఉత్కంఠ నడుమ జరిగిన ఎన్నికల్లో సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీ అధికార సంఘంగా గుర్తింపు సాధించింది. కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్ టీయూసీ నుంచి గట్టి పోటీ ఎదురైంది. మొత్తం 11 రీజియన్లలో 5 ఏఐటీయూసీ, 6 ఐఎన్ టీయూసీ సొంతం చేసుకున్నాయి. ఐఎన్ టీయూసీ కన్నా 1983 అత్యధిక ఓట్లు పొందిన ఏఐటీయూసీ అధికార గుర్తింపు సంఘంగా నిలిచింది.

Also Read అంగన్ వాడీ కార్యకర్తలకు హెచ్చరిస్తూనే ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి

అధికార గుర్తింపు సంఘంగా నిలవడంతో ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. సింగరేణి ఏర్పడిన అనంతరం ఏడోసారి ఏఐటీయూసీ ఏడోసారి అధికార గుర్తింపు సంఘంగా గుర్తింపు సాధించడం విశేషం. తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి పాత్ర మరువలేనిది. దాదాపు పది జిల్లాల్లో సింగరేణి ప్రాంత ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మాదిరే సింగరేణి ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఇక్కడ బీఆర్ఎస్ అనుబంధ సంఘం పత్తా లేకుండాపోయింది.

Also Read బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ తొలి జీతం ఎంతో తెలుసా?

ఏఐటీయూసీ గెలిచిన స్థానాలు
బెల్లంపల్లి: 122
మందమర్రి: 467
శ్రీరాంపూర్: 2166
రామగుండం 1: 333
రామగుండం 2: 417
మొత్తం ఓట్లు: 3465

ఐఎన్ టీయూసీ గెలిచిన స్థానాలు
కార్పొరేషన్ 296
కొత్తగూడెం: 233
మణుగూరు: 2
ఇల్లందు: 46
భూపాలపల్లి: 801
రామగుండం 3: 104
మొత్తం ఓట్లు: 1482

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button