తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Uttam: మేం గెలుస్తున్నాం.. డిసెంబర్ 9న గడ్డం తీసేస్తా: ఉత్తమ్

అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం (Fake Propaganda) చేస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, హుజుర్ నగర్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు ఆపాలని ఎన్నికల సంఘానికి తాను ఫిర్యాదు (Complaint) చేయలేదని, అది అవాస్తవమని కొట్టిపారేశారు. ఇదంతా గులాబీ పార్టీ (BRS Party) సృష్టిస్తున్న తప్పుడు ప్రచారమని మండిపడ్డారు.

చదవండి: ఎన్నికల వేళ ప్రచారంలోకి దూకిన హీరో నాని

హైదరాబాద్ (Hyderabad)లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తమ్ (Uttam Kumar Reddy) తనపై జరుగుతున్న ప్రచారం, విమర్శలపై స్పందించారు. ‘సీఎం కేసీఆర్ (KCR)తోపాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓటమి భయంతోనే కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేస్తున్నారు. రైతుబంధుతోపాటు ఇతర పథకాలను నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేలోపు ఇవ్వాలని మాత్రమే ఈసీని కోరాను. 24 గంటల విద్యుత్ సహా ఇతర అంశాలపై సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రచారం ప్రజలు నమ్మొద్దు. మా పార్టీలోకి అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో (Manifesto) ప్రకటించిన ప్రతి హామీని అమలు చేసి తీరుతాం’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

చదవండి: విజయశాంతి అలా చేరారో.. లేదో ఇలా ప్రమోషన్

పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకకు (Karnataka) వెళ్లి వచ్చానని.. అక్కడ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయని ఉత్తమ్ తెలిపారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి రాబోతున్నదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం పార్టీ అధికారంలోకి వస్తుండడంతో డిసెంబర్ 9వ తేదీన గడ్డం (Shave) తీసేస్తా అని ఉత్తమ్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button