తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

KTR: హైదరాబాద్ లో ఫార్ములా ఈ- రేస్ రద్దు.. కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్ లో ఫార్ములా ఈ–రేస్ రద్దు నిర్ణయంపై కేటీఆర్ ట్విట్టర్‌‌‌‌లో స్పందించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దారుణమైన, తిరోగమన చర్య అని పేర్కొన్నారు. ఇలాంటి ఈవెంట్స్ వలన ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌‌తో పాటు దేశం బ్రాండ్ ఇమేజ్‌‌ను పెంచుతాయన్నారు. భారతదేశానికి మొదటిసారిగా ఫార్ములా ఈ– ప్రిక్స్‌‌ను తీసుకురావడానికి తాము చాలా కృషి చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌‌ను ఆకర్షణీయమైన పెట్టుబడి కేంద్రంగా మార్చడానికి దీన్ని ఉపయోగించుకున్నామన్నారు.

Also read: Prajapalana: ప్రజాపాలనకు ముగిసిన దరఖాస్తుల స్వీకరణ.. శివుడి పేరుతో అర్జీ

ఈవీ ఔత్సాహికులు, తయారీదారులు స్టార్టప్‌‌లను ఆకర్షిస్తూ ఒక వారం పాటు ఈవీ సమ్మిట్‌‌ను నిర్వహించడానికి కేసీఆర్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్‌‌ను వినియోగించుకుందని వెల్లడించారు. ఈ తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేస్ ను రద్దు చేయడం సమంజసం కాదన్నారు. ఇలాంటి చర్యలు రాష్ట్రానికి చాలా నష్టం కలిగిస్తాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button