తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Nagarjuna: నాగార్జున కొత్త మూవీపై అప్డేట్.. లాయర్ గెటప్ లో కొత్త పాత్ర

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రయోగాలు చేయాలన్నా, కొత్త దర్శకులను పరిచయం చేయాలన్నా నాగార్జున ముందు ఉంటారు. శివ, అన్నమయ్య, మాస్ అలా వచ్చిన సినిమాలే. ఇక తాజాగా మరో కొత్త దర్శకుడితో నాగార్జున చేస్తున్న మూవీ నా సామిరంగ. ప్రముఖ నృత్య దర్శకుడు విజయ్ బిన్నీ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీ రోల్ చేస్తున్న ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also read: The Kerala Story: ఓటిటిలోకి వచ్చేస్తున్న ది కేరళ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఈ సినిమా తరువాత కూడా మరో కొత్త దర్శకుడితో, కొత్త కాన్సెప్ట్ తో సినిమా చేయనున్నాడట నాగార్జున. యదార్ధ సంఘటల ఆధారంగా సమకాలిన సామాజిక అంశాలతో దర్శకుడు సుబ్బు చెప్పిన కథ నాగార్జునకు చాలా బాగా నచ్చిందట. అందుకే ఈ ప్రాజెక్టుకు వెంటనే ఓకే చెప్పేశాడట. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. చాలా కాలం తరువాత ఈ సినిమాలో లాయర్ గా కనిపించనున్నారు నాగార్జున. కోర్టు రూమ్ డ్రామాతో ఎమోషనల్ కంటెంట్ తో రానున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ వార్త తెలుసుకున్న నాగార్జున ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ఈ సినిమా నాగార్జునకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button