తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్రాజకీయం

AP Politics: దత్తపుత్రుడికి కాపులంటే ప్రేమలేదా?

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును నేడు పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాల నుంచి ఆయనను విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. అయితే చంద్రబాబును కలిసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడ వచ్చేందుకు రెడీ అయ్యారు.

కానీ ఆయన విజయవాడకు వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే ఉద్ద్యేశంతో పోలీసులు.. పవన్ విజయవాడ వచ్చేందుకు అనుమతించవద్దని ఎయిర్ పోర్టు అధికారులను కోరారు. దీంతో వారు పవన్ ను హైదరాబాద్ లో అడ్డుకున్నారు.

ఇది ఇలా ఉంటే.. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ల కోసం మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం నిరసన చేసినప్పుడు పవన్ దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా ముద్రగడ ఇంటికి పోలీసులు వెళ్లి ఆయన భార్యను దుర్భాషలాడి, ఆయనను అరెస్ట్ చేసినా కనీసం స్పందించని పవన్.. నేడు చంద్రబాబును అరెస్టు చేయగానే ఆగమేఘాలమీద విజయవాడ వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

దీన్ని బట్టి పవన్ చంద్రబాబు కోవర్ట్ గా పనిచేస్తున్నారని.. చంద్రబాబుకు ఆయన దత్తపుత్రుడు అనటంలో తప్పులేదని పలువురు రాజకీయ నేతలు విశ్లేషిస్తున్నారు. అలాంటి పవన్ కాపు రిజర్విషన్లపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని పేర్కొంటున్నారు. కాపు యువతలో పవన్ పై కొంత ప్రేమ ఉన్నప్పటికీ.. పవన్ మాత్రం వారిని రాజకీయంగా వాడుకొని లబ్ధి పొందాలని చూస్తున్నారే తప్ప.. వారికి మంచి చేసే ఆలోచన లేదని కాపు పెద్దలు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button