తెలుగు
te తెలుగు en English
క్రికెట్క్రీడలు

Sanju Samson: రాహుల్ ఇన్…సంజు శాంసన్ అవుట్ ఎందుకిలా?

ఆసియా కప్ లో భాగంగా రిజర్వ్ ప్లేయర్ గా ఎంపికైన సంజు శాంసన్ ని తాజాగా భారత మేనేజ్ మెంట్ విడుదల చేసింది. టోర్నీ సూపర్ 4 దశకు ముందు కేఎల్ రాహుల్ జట్టులోకి రావడంతో భారత జట్టు మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. రాహుల్‌కు బ్యాకప్‌గా శాంసన్ ఎంపికయ్యాడు. అయితే రాహుల్ గాయం కారణంగా లీగ్ లో తొలి రెండు మ్యాచులు ఆడలేదు. కానీ ప్రస్తుతం రాహుల్ పూర్తి స్థాయిలో కోలుకోవడంతో శాంసన్ అవసరం ఇక లేదని భావించి స్వదేశానికి పంపించేశారు. కేఎల్ రాహుల్ గత ఐపీఎల్ సమయంలో తొడ కండరాల గాయం బారిన పడి, శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అతడి ఫిట్ నెస్ పై సందేహాలు ఉండడంతో బ్యాకప్ గా ఎందుకైనా మంచిదన్న ఉద్దేశ్యంతో శాంసన్ ను కూడా ఎంపిక చేశారు.వన్డే ప్రపంచకప్ 2023 టీమ్ లోనూ శాంసన్ కు చోటు లభించలేదు.

ఆసియా కప్‌-2023 టోర్నీకి ప్రకటించిన జట్టులో కేరళ బ్యాటర్‌ సంజూ శాంసన్‌కు ట్రావెలింగ్‌ రిజర్వ్‌గా స్థానం దక్కింది. సీనియర్‌ వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ ఫిట్‌నెస్‌ సమస్యల దృష్ట్యా ప్రధాన జట్టులో ఇషాన్‌ కిషన్‌కు చోటిచ్చిన మేనేజ్‌మెంట్‌.. సంజూను బ్యాకప్‌గా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో తనకు వచ్చిన అవకాశాన్ని జార్ఖండ్‌ బ్యాటర్‌ ఇషాన్‌ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఆసియా కప్ లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడి….గౌరవప్రదమైన స్కోరు చేయడంలో ఈ వికెట్‌ కీపర్‌ కీలక పాత్ర పోషించాడు.

వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాతో కలిసి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైపోగా.. నేపాల్‌తో మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌ లక్ష్యాన్ని పూర్తి చేయడంతో ఇషాన్‌కు బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. సూపర్‌-4లో భాగంగా పాకిస్తాన్‌తో ఆదివారం టీమిండియా తలపడనుంది.ఈ నేపథ్యంలో పూర్తి ఫిట్‌నెస్‌ సాధించిన కేఎల్‌ రాహుల్‌ అందుబాటులోకి వచ్చాడు. నెట్‌ సెషన్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న ఈ కర్ణాటక బ్యాటర్‌.. తుదిజట్టులోకి రావడం ఖాయంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button