తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్
Trending

CM Jagan: చంద్రబాబుకు పుట్టుకతోనే మోసం అలవాటు!

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలు, మోసపూరిత వాగ్దానాల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలిసే ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక రాజకీయాల్లో, పాలనలో ఎంతో అనుభవం ఉందని చెప్పుకున్న చంద్రబాబును నమ్మి రాష్ట్ర ప్రజలు ఆయనకు అధికారం అప్పజెప్పారు. కానీ 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు రాష్ట్రాన్ని ఎలా భ్రష్టుపట్టించారో, అభివృద్ధిని ఎలా తిరోగమనంలో పయనించేలా చేశారో అందరం చూశాం. ఆ ఐదేళ్ల కాలంలో చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని వర్గాల వారిని మోసం చేశారు. ఇదే విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్నటి భీమవరం ‘మేమంతా సిద్ధం’ సభలో మరోసారి తెలియజేశారు. ‘రొయ్యకు మీసం.. చంద్రబాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయ్‌!’ అంటూ విరుచుకుపడ్డారు.

 ALSO READ: మీరంతా అండగా ఉండగా.. నేను ఒంటరి కాదు!: జగన్

చంద్రబాబు మోసాల చిట్టా

2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల్ని ఆయన ఏ విధంగా మోసం చేశారో ప్రజలకు పూసగుచ్చినట్లు వివరించారు. బాబు అధికారంలోకి రాగానే రైతులందరికీ రూ. 87,612 కోట్ల రుణమాఫీ చేస్తానని హామి ఇచ్చి మోసం చేశారని అన్నారు. రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు, కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? అంటూ జగన్ ప్రజల్ని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు చివరికి నిరుద్యోగులను కూడా మోసం చేశారని అన్నారు. ఇలాంటి మోసాలు ఇంకా ఎన్నో ఉన్నాయన్నారు.

ALSO READ: మరో సర్వే వచ్చేసింది.. ఆ పార్టీదే అధికారం!

బాబును నమ్మితే మళ్లీ అంతే!

అంతేకాదు, ఎన్నికలకు ముందు చంద్రబాబు బీసీ సబ్‌ప్లాన్, చేనేత, పవర్‌ లూమ్స్‌ రుణాలు మాఫీ అని చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చాక అన్ని హామీలను గాలికొదిలేశారని సీఎం జగన్ విమర్శించారు. రాష్ట్రాన్ని సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తామని నమ్మంచిన బాబు అందరినీ మోసం చేశారని అన్నారు. ప్రతి నగరంలో హైటెక్‌ సిటీని నిర్మిస్తానని చెప్పి, కనీసం స్కూలు, ఆసుపత్రిని కూడా నిర్మించలేదని దుయ్యబట్టారు. కాబట్టి చంద్రబాబును నమ్మితే రాష్ట్ర ప్రజలు మరోసారి మోసపోక తప్పదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button