తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

YS Jagan: మీరంతా అండగా ఉండగా.. నేను ఒంటరి కాదు!

మీ ఓటు.. ఐదేళ్ల భవిష్యత్‌ అని, ఈ ఓటుతో దుష్టచతుష్టయం కూటమిని అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. భీమవరంలో జరిగిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. విపక్షాల మోసాల నుంచి పేదల భవిష్యత్తును కాపాడుకునేందుకు మీరంతా సిద్ధమేనా ? అన్నారు. రానున్న ఎన్నికలు ఐదేళ్ల భవిష్యత్తు, పిల్లల చదువులు, అక్కాచెల్లెమ్మల సాధికారత, అవ్వాతాతల సంక్షేమం, రైతులకు న్యాయం జరిగేందుకు నిర్ణయించేది ఈ ఎన్నికలని, ఇవే మన తలరాతలు మార్చేవని వెల్లడించారు.

ALSO READ: మరో సర్వే వచ్చేసింది.. ఆ పార్టీదే అధికారం!

అందుకే బాబుకు నాపై కోపం

ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో మనం పనిచేస్తుంటే.. కొంతమంది జెండాలు జతకట్టి వస్తున్నారన్నారు. ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను, అభివృద్ధి పాలనను అందిస్తున్న మీ బిడ్డను ఒంటరి చేయాలని చూస్తున్నారన్నారు. మీరంతా నా వెంట ఉండగా.. జగన్ ఒంటరి కాదన్నారు. చంద్రబాబు అంటేనే వెన్నుపోట్లు, దగా, మోసం గుర్తుకువస్తుందన్నారు. నీ పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా అని చంద్రబాబుని అడిగా.. అందుకే నాపై కోపం, ఆయనకు అందుకే బీపీ ఎక్కువై పోతోందన్నారు.

ALSO READ: దేవుడి ఆశీస్సులు మనకే.. 16వ రోజు ప్రారంభమైన బస్సుయాత్ర!

దత్తపుత్రా.. ఒకసారి చేస్తేనే పొరపాటు

దత్తపుత్రా.. పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి, పిల్లను పుట్టిచ్చి, నాలుగేళ్లకు, ఐదేళ్లకొకసారి కార్లును మార్చేసినట్లుగా భార్యను వదిలేసినట్లుగా నియోజకవర్గాలకు అలవోకగా మార్చేస్తున్నావ్‌.. ఏం మనిషవయ్యా అని అడిగినందుకు దత్తపుత్రుడిలో బీపీ బాగా కనిపిస్తోందనా జగన్ చురకలు వేశారు. అయ్యా దత్తపుత్రా.. ఒకసారి చేస్తే పొరపాటు.. మళ్లీ మళ్లీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యా అని ఎద్దేవా చేశారు. ఆడవాళ్ల జీవితాలను చులకనగా చూపించడం తప్పుకాదా? నిన్ను చూసి ఇదే తప్పు ప్రతీ ఒక్కరు చేస్తే.. ఇలా భార్యలను మార్చేస్తే అక్క చెల్లెమ్మల బతుకులు ఏం కావాలి అని కనీసం ఆలోచన కూడా చేయని ఆ పెద్ద మనిషిలో బీపీ కూడా పెరిగిపోతోందన్నారు. చేయిలూపేస్తాడు.. కాళ్లు ఊపేస్తాడు.. తల ఊపేస్తాడు.. అయినా పవన్‌ కల్యాణ్‌ బీపీని అసలు తట్టుకోలేమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button