తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్
Trending

Jagan Memantha Siddam: దేవుడి ఆశీస్సులు మనకే.. 16వ రోజు ప్రారంభమైన బస్సుయాత్ర!

జగన్ మీద రాయి వేసినంత మాత్రాన.. ఎన్నికల కురుక్షేత్రంలో గెలిచినట్లు కాదని సీఎం జగన్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా గుడివాడ బహిరంగ సభలో మాట్లాడారు. ఎన్ని దాడులు చేసినా మీ బిడ్డ అదరుడు.. బెదరడు అన్నారు. కొంతమంది నేరుగా ఢీకొట్టలేక ప్రత్యర్థులపై దాడి చేసేంత స్థాయికి దిగజారుతున్నారన్నారు. దాడి చేసినప్పటికీ దేవుడి ఆశీస్సులు మనకే ఉండడంతో పెద్ద గాయం కాలేదన్నారు. ఈ గాయం పది రోజుల్లో తగ్గిపోతుందని, కానీ పేదలకు చంద్రబాబు చేసిన గాయాలను ఎప్పటికీ మరిచిపోరని తెలిపారు.

ALSO READ: ప్రజల ఆశీర్వాదం వల్లే దాడి నుంచి తప్పించుకున్నా: జగన్

మరింత అభిమానం..

బెజవాడ వేదికగా రాయి దాడి సంఘటన తర్వాత ఒక్కరోజు విరామం తర్వాత నిర్వహించిన బస్సు యాత్రకు ప్రజల నుంచి మరింత ఉత్సాహం లభించింది. మండుటెండను సైతం ఏ మాత్రం లెక్కజేయకుండా జగన్‌ను చూసేందుకు అభిమానులు, ప్రజలు ఎగబడుతున్నారు. కంటిపై గాయమైనా ముఖంలో ఏ మాత్రం తగ్గని చిరునవ్వులతో అందరినీ పలకరిస్తూ అదే మాట..అదే స్టైల్‌గా సీఎం ముందుకు సాగుతున్నారు. దాడులు యాత్రను, ప్రయాణాన్ని ఆపలేవంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఉదయమే 9 గంటలకు విడిది ప్రాంతంలో అభిమానులు, కార్యకర్తలు, నేతలతో కిక్కిరిసిపోతోంది.

ALSO READ: జగన్ మీద దాడి.. దిగజారిన యెల్లో మీడియా!

భీమవరంలో బహిరంగ సభ

వైఎస్‌ జగన్‌ చేపట్టిన ఈ బస్సు యాత్ర నేటితో 16వ రోజుకు చేరుకుంది. ఇవాళ ఉదయం 9 గంటలకు నారాయణపురం దగ్గర నుంచి బయలుదేరింది. ఈ యాత్ర నిడమర్రు, గణపవరం మీదుగా ఉండి చేరుకోనుంది. ఇక, ఉండి శివారులో సీఎం జగన్‌ భోజన విరామం తీసుకోనున్నారు. ఆపై అక్కడి నుంచి బయలుదేరి భీమవరం బైపాస్‌ రోడ్‌ గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్‌ కాలేజ్‌ వద్ద సాయంత్రం 3.30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్‌ ప్రసంగించనున్నారు. ఇక్కడినుంచి పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్‌ మీదుగా ఈతకోట శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button