తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Elecsense Survey: మరో సర్వే వచ్చేసింది.. ఆ పార్టీదే అధికారం!

రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పలు రకాల సర్వేలు సైతం సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలు సర్వేల్లో అధికార పార్టీ వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుందని ప్రకటించగా.. తాజాగా, మరొక ప్రముఖ ఎలెసెన్స్ అనే సంస్థ తన సర్వే ఫలితాలను వెల్లడించింది. కాగా, మార్చి 25 నుంచి ఏప్రిల్ 12 వరకు నిర్వహించిన ఈ సర్వేలో వైసీపీ మరొకసారి ప్రభంజనం సృష్టిస్తుందని తెలిపింది. ఇందులో మొత్తం 86,200 మంది నుంచి అభిప్రాయాలను సేకరించినట్లు ప్రకటించింది.

ALSO READ: దేవుడి ఆశీస్సులు మనకే.. 16వ రోజు ప్రారంభమైన బస్సుయాత్ర!

వైసీపీ పార్టీకే మెజార్టీ సీట్లు..

వైసీపీని గద్దె దించాలని టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేన, బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడింది. కానీ ప్రతిపక్షాలు కూటమిగా వచ్చినప్పటికీ వైసీపీ పార్టీకి మెజార్టీ సీట్లు దక్కుతాయని ఎలెసెన్స్ సర్వే తేల్చింది. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాల్లో 17 రోజులపాటు ఈ సర్వే కొనసాగింది. ఇందులో 127 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని స్పష్టం చేసింది. ఓట్ల వారీగా చూస్తే.. వైసీపీ 50.38 శాతం ఓట్లు సాధిస్తుందని తేల్చింది. ఇక టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మాత్రం 45.58 శాతానికే పరిమితమై 48 స్థానాల్లో విజయం సాధించనుందని తెలిపింది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ 1.3 శాతం ఓట్లకు పరిమితం కానుందని తెలిసింది.

ALSO READ:  ప్రజల ఆశీర్వాదం వల్లే దాడి నుంచి తప్పించుకున్నా: జగన్

ఉమ్మడి జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే?

జిల్లాల వారీగా ఏ పార్టీకు ఎన్ని సీట్లనేది వివరించింది. ఉమ్మడి జిల్లాల పరంగా సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఎలెసెన్స్ సంస్థ సర్వే ప్రకారం.. అమరావతి ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా మరోసారి కన్పించనుండగా.. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో సైతం వైసీపీ హవా వీయనుందని తెలిపింది.

శ్రీకాకుళం జిల్లా

వైసీపీ – 8,
ఎన్డీఏ – 2.

విజయనగరం

వైసీపీ – 8,
ఎన్డీఏ – 1.

విశాఖ

వైసీపీ – 4,
ఎన్డీఏ – 8,
ఇతరులు – 3.

తూర్పుగోదావరి
వైసీపీ – 9,
ఎన్డీఏ – 9,
ఇతరులు – 1.

పశ్చిమగోదావరి

వైసీపీ – 8,
ఎన్డీఏ – 7.

కృష్ణా జిల్లా

వైసీపీ – 10,
ఎన్డీఏ – 5,
ఇతరులు – 1.

గుంటూరు

వైసీపీ – 9,
ఎన్డీఏ – 2,
ఇతరులు – 6.

ప్రకాశం

వైసీపీ – 9,
ఎన్డీఏ – 2,
ఇతరులు – 1.

నెల్లూరు

వైసీపీ – 9,
ఇతరులు – 1.

చిత్తూరు

వైసీపీ – 12,
ఎన్డీఏ – 1.

కడప

వైసీపీ – 10.

కర్నూలు

వైసీపీ – 13,
ఎన్డీఏ – 1.

అనంతపురం

వైసీపీ – 12,
ఎన్డీఏ – 1.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button