తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం
Trending

ఏప్రిల్ 17: చరిత్రలో ఈరోజు

జె. గీతారెడ్డి పుట్టినరోజు

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జె. గీతారెడ్డి 1947లో హైదరాబాద్ సంస్థానం పరిధిలో జన్మించారు. ఉస్మానియాలో వైద్యవిద్యను అభ్యసించారు. 1989లో గైనాకాలజిస్ట్స్ గా లండన్ లో సభ్యురాలు అయ్యారు. 1971-77 మధ్య ఆస్ట్రేలియాలో, 1977-80 మధ్యలో లండన్, 1980-82 వరకు సౌదీ అరెబియాలో నివసించారు. 1989లో కాంగ్రెస్ లో చేరి గజ్వేల్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994, 1999 ఎన్నికల్లో అదే స్థానంలో ఓటమిపాలయ్యారు. 2004 మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ఆర్, రోశయ్య కేబినెట్ లో మంత్రిగా సేవలందించారు. 2009, 14 ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ఎన్నికల్లో ఓడిపోయారు.

Also Read: మరో సర్వే వచ్చేసింది.. ఆ పార్టీదే అధికారం!

విక్రం పుట్టినరోజు

దక్షిణ భారతదేశ ప్రముఖ నటుడు, సినీ హీరో విక్రం 1966 తమిళనాడులోని రామనాథపురం జిల్లా పరమకుడిలో జన్మించారు. ఇదే ఊరు నుంచి ముగ్గురు నటులు చారుహాసన్, కమల్ హాసన్, సుహాసిని ఉండటం గమనార్హం. తమిళ, తెలుగు సినిమాల్లో ఎన్నో చిత్రాల్లో హీరోగా నటించారు. తెలుగులో విక్రమ్ మొదటి సినిమా దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన అక్క పెత్తనం చెల్లెలి కాపురం. అందులో రాజేంద్రప్రసాద్ కు స్నేహితుడిగా నటించారు. తెలుగులో ఆయన చేసిన శివపుత్రుడు సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం దక్కింది. తెలుగులో అపరిచితుడు, ఐ, మల్లన్న సినిమాలు గుర్తింపును తెచ్చాయి.

ఇంద్రగంటి మోహన కృష్ణ పుట్టినరోజు

తెలుగు సినిమా డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ 1972 పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జన్మించారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం గ్రహణం సినిమాకి నంది పురస్కారం, 11 అవార్డులు దక్కాయి. 2006లో భూమికతో మాయాబజార్, గోల్కొండ హైస్కూల్, జెంటిల్ మాన్ వంటి చిత్రాలను తెరకెక్కించారు.

సిద్ధార్థ్ నారాయణ్ పుట్టినరోజు

భారతీయ నటుడు, నిర్మాత, గాయకుడు సిద్ధార్థ్ నారాయణ్ 1979 తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు. 2003లో వచ్చిన బాయ్స్ చిత్రంతో రంగప్రవేశం చేశారు. తన నటనతో ఎన్నో జాతీయ పురస్కారాలను అందుకున్నారు.

Also Read: దేవుడి ఆశీస్సులు మనకే.. 16వ రోజు ప్రారంభమైన బస్సుయాత్ర!

సునయన పుట్టినరోజు

భారతీయ నటి, మోడల్ సునయన యెల్లా 1989 మహారాష్ట్రలోని నాగపూర్ లో జన్మించారు. 2005లో తెలుగులో విడుదలైన కుమార్ Vs కుమారి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టారు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించారు.

సర్వేపల్లి రాధకృష్ణన్ మరణం

భారతదేశ మాజీ రాష్ట్రపతి, భారతరత్న, రాజకీయ, తత్వవేత్త డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ 1975 తమిళనాడులోని మద్రాసులో మరణించారు. ఈయన 1888 సెప్టెంబర్ 5న తమిళనాడులోని తిరుత్తణిలో జన్మించారు.. 1909లో తొలిసారిగా మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిలాసఫీ విభాగానికి ప్రొఫెసర్ గా నియమితులయ్యారు. 1962- 67 వరకు భారత రెండో రాష్ట్రపతిగా పనిచేశారు. 1952-62 వరకు రెండు పర్యాయాలు భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతిగానూ పనిచేశారు. 1954 భారత ప్రభుత్వం ఈయనకు భారతరత్న పురస్కారం అందజేసింది. భారత జట్టు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఈయనకు మేనల్లుడు.

సౌందర్య మరణం

భారతీయ సినీనటి సౌందర్య 2004 కర్ణాటకలోని బెంగళూరు వద్ద జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. 2004 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ప్రచారం చేసి.. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి విద్యాసాగర్ రావు తరపున ప్రచారం చేసేందుకు వస్తుండగా.. బెంగళూరులో ఆమె ఎక్కిన ఛార్టెడ్ విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కూలిపోవడంతో సజీవదహనమయ్యారు. సౌందర్య అసలు పేరు సౌమ్య. ఈమె 1972 జూలై 17న కర్ణాటక లోని కోలారు జిల్లా ముళబాగల్ వద్ద జన్మించారు. సౌందర్య తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో మొత్తం 100 చిత్రాల వరకు నటించారు. 12 ఏళ్లుగా నటిగా వెండి తెరపై వెలుగు వెలిగారు.

Also Read: ప్రజల ఆశీర్వాదం వల్లే దాడి నుంచి తప్పించుకున్నా: జగన్

బెంజమిన్ ఫ్రాంక్లిన్ మరణం

అమెరికాకు చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత, శాస్త్రవేత్త, ఆవిష్కర్త, రాజకీయ తత్వవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్ 1790 అమెరికా పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో మరణించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల వ్యవస్థాపక పితామహులలో ఈయన ఒకరు. ఈయన 1706 బ్రిటిష్ అమెరికాలోని బోస్టన్ లో జనవరి 17న జన్మించారు. 23 ఏళ్ల వయస్సులోనే పెన్సిల్వేనియా గెజిట్ అనే పత్రికకు ఎడిటర్ గా పనిచేశారు. ‘లైట్నింగ్ కండక్టర్’ కనుక్కోవడం ద్వారా ప్రపంచంలో గుర్తింపు పొందారు. సముద్రం మీద ఎన్నో పరిశోధనలు చేశారు. ఈయన రూపొందించిన స్టౌవ్ లు, బై ఫోకల్ కంటి అద్దాలు ఇప్పటికీ వాడబడుతున్నాయి. నల్లమట్టిలో సున్నం కలపడం వలన ఎసిడిఫికేషన్ ప్రాసెన్ ను నియంత్రించవచ్చని సూచించారు. గాలి, వెలుతురు లేని చోట్ల అంటువ్యాధులు త్వరగా వ్యాపిస్తాయని వెల్లడించారు.

దేవినేని నెహ్రూ మరణం

ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి దేవినేని నెహ్రూ 2017 హైదరాబాద్ లో మరణించారు. విజయవాడలో కీలక నేతగా పేరుపొందిన ఈయన 1954 కృష్ణా జిల్లా కంకిపాడు మండలం నెప్పల్లిలో జన్మించారు. విద్యార్థి నాయకుడిగా 1982 టీడీపీలో చేరారు. కంకిపాడు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు, విజయవాడ తూర్పు అసెంబ్లీ స్థానం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009, 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. అనంతరం మళ్లీ టీడీపీలో చేరారు.

వి.ఎస్. రమాదేవి మరణం

భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమిషనర్ విఎస్ రమాదేవి 2013 కర్ణాటకలోని బెంగళూరులో మరణించారు. ఈమె 1934 పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలులో జనవరి 15న జన్మించారు. 1959లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేయడం మొదలుపెట్టారు. 1997-99 వరకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా, 1999-2002 వరకు కర్ణాటక రాష్ట్రానికి గవర్నర్ గా సేవలందించారు.

మరిన్ని విశేషాలు

  • భారత లోక్ సభ స్పీకర్ గా 1962 లో సర్దార్ హుకుం సింగ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.
  • వాయుమార్గం ద్వారా 1964లో జెర్రీ మాక్ భూగోళాన్ని చుట్టివచ్చిన మొదటి మహిళగా రికార్డుకెక్కారు.
  • రంగస్థల, టీవీ, సినీ నటుడు రజితమూర్తి చెట్టెభక్తుల 1950 పశ్చిమగోదావరి జిల్లా రావిపాడులో జన్మించారు.
  • భారతీయ నటి నైనా గంగూలీ 1994 పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో జన్మించారు.
  • రంగస్థల నటుడు నిడుముక్కల సుబ్బారావు 1968లో మరణించారు.
  • మావోయిస్టు దళపతి, అగ్రనేత నారాయణ సన్యాల్ 2017 కలకత్తాలో కన్నుమూశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button