తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Government: పథకాల పండుగ.. అర్హత ఉంటే చాలు!

సంక్షేమ పథకాలను అమలులో సీఎం వైఎస్ జగన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందేలా పక్కా ప్రణాళితో అమలు చేస్తున్నారు. ఈ మేరకు 31 రోజులపాటు సుమారు 1.5కోట్ల పేదలకు సంక్షేమ పథకాలను అందించనున్నారు. ఈ మేరకు డిసెంబర్ 19 నుంచి జనవరి చివరినాటికి ఆయా పథకాలను పంపిణీ చేసేందుకు తేదీలను ఖరారు చేశారు.

ALSO READ: ఆంధ్రప్రదేశ్ మరో ఘనత.. సరుకు రవాణాలో నంబర్ వన్

ఉన్నత విద్యకు సహకారం

రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ప్రభుత్వం ప్రతి ఏటా ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా ఏపీలో జగనన్న విద్యాదీవెన డబ్బుల విడుదల తేదీలో మరోసారి మార్పు జరిగింది. డిసెంబర్‌ 19న సీఎం వైఎస్‌ జగన్‌ బటన్‌ నొక్కి దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఐఐటీ చదువుతున్న విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ, మెడిసిన్, ఇంజినీరింగ్ విద్యార్థులకు రూ.20వేల ఆర్థికసాయం అందనుంది అదే విధంగా 21న జగన్ బర్త్ డే సందర్భంగా రూ. 638కోట్లతో 4.35లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయనున్నారు.

ALSO READ: క్లీన్ స్వీప్ దిశగా సీఎం జగన్ అడుగులు.. సంక్రాంతి తర్వాత రంగంలోకి?

పెన్షన్ పెంపుతో కొత్త పండగ

వైఎస్సార్ పింఛన్ భరోసా పథకంలో భాగంగా ఇప్పటివరకు రూ.2,750 ఉన్న సామాజిక పెన్షన్‌ను రూ.3వేలకు పెంచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జనవరి 1న సుమారు 65.33 లక్షల మందికి పంపిణీ చేయనున్నారు. అదే విధంగా అదే నెల 29న వైఎస్సార్ చేయూత కింద లబ్ధిదారులకు రూ.18,750 నగదును అందించనున్నారు. వీటితోపాటు మరికొన్ని పథకాలను అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో రానున్న 31 రోజుల పాటు రాష్ట్రంలో పథకాల పండగ వేడుక జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button