తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Politics: రాజ్యసభలో ఉనికి కోల్పోతున్న టీడీపీ! క్యాడర్‌లో గందరగోళం

తెలుగువాడి ఆత్మగౌరవ నినాదం.. ఒక్క పిలుపు ఓ ప్రభంజనంలా.. తెలుగువాళ్లకు సరికొత్త రాజకీయాన్ని పరిచయం చేసిన పార్టీ తెలుగు దేశం. 1982 మార్చి 29న అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎంత సంచలనం సృష్టించాయి. కానీ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడి­చి చంద్రబాబు ఆ పార్టీని చేజిక్కించుకున్న తర్వాత టీడీపీ క్రమంగా ప్రభవం కోల్పో­తూ వస్తోంది. ప్రస్తుతం నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ పార్టీ పొత్తుల విషయంలో అయోమయంలో పడిపోయింది. ఒంటరిగా పోటీ చేయలేక ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తప్పా గెలవలేని స్థాయికి దిగజారింది. దీంతో క్యాడర్‌లో గందరగోళం నెలకొంది.

ALSO READ: జనసేనానిపై క్రిమినల్ కేసు.. వాలంటీర్లపై వ్యాఖ్యలకు చర్యలు

టీడీపీ అడ్రస్‌ గల్లంతేనా!

రాజ్యసభలో టీడీపీ అడ్రస్‌ గల్లంతు కానుంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు రాజ్యసభలో ఆ పార్టీకి సభ్యులు లేకపోవడం ఇదే తొలిసారి అవుతుంది. ఏప్రిల్‌ 2 నాటికి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, సీఎం రమేష్‌, కనకమేడల రవీంద్రకుమార్‌ల పదవీకాలం పూర్తికానుంది. కొత్తగా రాజ్యసభకు ఎన్నికకు కావాలంటే 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ప్రస్తుతం శాసనసభలో వైసీపీకి ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే.. ఈ మూడు స్థానాలు ఆ పార్టీ ఖాతాలో చేరడం ఖాయం.

ALSO READ: ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన.. వచ్చే నెలలో నోటిఫికేషన్?

అసెంబ్లీలోనూ ఇదే పరిస్థితి రానుందా?

రాజకీయాల్లో 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబు టీడీపీకి రాజ్యసభలో ఒక్క సీటు కూడా లేదు.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీలో కూడా ఇదే పరిస్థితి రానుందని వైసీపీ నాయకులు అంటున్నారు. వైసీపీ ప్రభంజనంలో టీడీపీ గల్లంతు కావడం ఖాయమని, వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని ఆపార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్‌ వ్యవస్థను తీసేస్తామని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్‌లు బెదిరింపులకు పాల్పడడంతో టీడీపీ, జనసేనలకు ఒక్క సీ­టు కూడా వచ్చే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే జరిగితే రాజ్యసభలో మాదిరిగా అసెంబ్లీలోనూ టీడీపీ ఉనికే లేకుండాపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button