తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Politics: శ్రీకాకుళంలో వైసీపీ వర్సెస్ టీడీపీ.. గెలిచే స్థానాలు ఎన్నంటే?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఇక కీలకమైన శ్రీకాకుళం ఎంపీతోపాటు ఏడు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించిన వైసీపీ.. ఈ నియోజకవర్గాల్లో ఫ్యాన్ జెండా ఎగురవేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మరోసారి సిట్టింగ్‌లతో పాటు కొన్నిచోట్ల మార్పులు చేస్తూ బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు వ్యూహ రచన చేస్తోంది.

మళ్లీ ఆ పార్టీదే హవా..

శ్రీకాకుళంలో పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజవర్గాలు ఉన్నాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో ఇచ్చాపురంలో బెందాళం అశోక్, టెక్కలిలో అచ్చెన్నాయుడు గెలుపొందగా.. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు, పలాసలో సీదిరి అప్పలరాజు, పాతపట్నంలో రెడ్డి శాంతి, ఆముదాలవలసలో తమ్మినేని సీతారం, నరసన్నపేటలో ధర్మాన కృష్ణాదాస్‌ విజయం సాధించారు. కాగా, డిసెంబర్‌ వరకు చేపట్టిన పక్కాతెలుగు గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం.. రానున్న ఎన్నికల్లో ఆరు స్థానాల్లో అనగా శ్రీకాకుళం, ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, నరసన్నపేట, ఆముదాలవలసలో వైసీపీ గెలుపొందగా.. టెక్కలిలో టీడీపీ లేదా జనసేన నుంచి నిల్చునే అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది.

గెలిచే స్థానాలివే..

క్రమ సంఖ్యఅసెంబ్లీ సెగ్మెంట్గెలుపొందే పార్టీ
1శ్రీకాకుళంవైఎస్సార్‌సీపీ
2ఇచ్చాపురంవైఎస్సార్‌సీపీ
3పలాసవైఎస్సార్‌సీపీ
4పాతపట్నంవైఎస్సార్‌సీపీ
5నరసన్నపేటవైఎస్సార్‌సీపీ
6ఆముదాలవలసవైఎస్సార్‌సీపీ
7టెక్కలిటీడీపీ/జనసేన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button