తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్తెలంగాణరాజకీయం

BJP: చంద్రబాబు అరెస్ట్.. పురంధేశ్వరికి షాక్

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించిందనే చెప్పాలి. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఏపీ సీఐడీ అభియోగాలు మోపింది. అందుకే చంద్రబాబును శనివారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ క్రమంలో ఇప్పటికే పురందేశ్వరి.. చంద్రబాబు అరెస్ట్ ను బీజేపీ ఖండిస్తుందని చెప్పగా… సంపూర్ణంగా ఖండిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ తాజాగా ఈ విషయంపై స్పందించారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు పురందేశ్వరికి షాక్ ఇచ్చేలా ఉన్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.

భారత్ ఓ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, గతంలో ఎంతోమంది అరెస్ట్ అయ్యారని గుర్తు చేసిన రఘునందన రావు… అనేకమంది ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల కుటుంబ సభ్యులు అరెస్టులు అయ్యారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో ఏం జ‌రిగిందో తనకింకా పూర్తిగా తెలియక పోయినా… ఇది మాత్రం ఏపీ ప్రభుత్వ సాహసంగా ఆయన అభివర్ణించారు.

అవును… మరో రెండు మూడు నెలల్లో ఎన్నిక‌ల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ రానున్న నేపథ్యంలో ప్రతిప‌క్ష నాయ‌కుడిని అరెస్ట్ చేసే సాహ‌సం పాల‌క ప‌క్షం చేసిందంటే… సాక్ష్యాలు, ఆధారాలు ఉంటేనే చేస్తారని అన్నారు. అలాకాకుండా… ఎన్నిక‌ల ముందు ఆ రాష్ట్ర ప్రతిప‌క్ష నాయకుడిని అరెస్ట్ చేసి, వారికి సానుభూతి వ‌చ్చేలా అరెస్ట్ చేస్తార‌ని తాను భావించడం లేదని అన్నారు. ఇవి పురందేశ్వరికి షాకిచ్చే వ్యాఖ్యలే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అదేపార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షురాలి వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button