తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

CBN Arrest: చంద్రబాబుకు జైలే.. 14 రోజులు రిమాండ్..!

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు, ఏసీబీ కోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో, ఇరువైపుల వాదనలు విన్న అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన జస్టిస్ హిమబిందు.. చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

ఇక ఈ కేసులో భాగంగా, ఈరోజు చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన జస్టిస్ హిమబిందు.. చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చారు.

దీంతో ఈ నెల 22 వరకు చంద్రబాబు రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించారు. మరికాసేపట్లో చంద్రబాబును సిట్ ఆఫీసుకు తరలించి, రేపు ఉదయం రాజమండ్రి జైలుకు తరలించే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని భావించిన టీడీపీ శ్రేణులు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు.

ఇక‌పోతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ప్రాథమిక ఆధారాలతోనే చంద్రబాబును అరెస్టు చేసినట్లు ఏపీ సిఐడి వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. గవర్నర్ అనుమతితో అరెస్ట్ చేయాలన్న వాదనలను సైతం కోర్టు కొట్టిపారేసింది. చంద్రబాబుకు రిమాండ్ అని తీర్పు రాగానే విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొనే అవకాశాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే టీడీపీ శ్రేణులు ధర్నాలు, రాస్తోరోకోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని స‌మాచారం.

11 Comments

  1. సొంత పుత్రుడి కంటే దత్త పుత్రుడి హడావిడి ఎక్కువ అయింది

  2. 2 ఎకరాల మనిషికి ఇన్ని కోట్లు ఇల్లు ఎలా వస్తాయి??? అందుకే పోయాడు బొక్కలోకి

  3. చేసిన కర్మ అనుభవించక తప్పదు బాబు. ఇదేముంది ఇంకా ఉంది ముందు ముందు..

  4. 48 లాయర్లు కి 144 కోట్లు ఇస్తున్నారు ఒక్క రోజుకి ఎంత మొత్తం లో రాష్ట్ర ని దోచుకుతిన్నారో ఇప్పటికీ అయిన గ్రహించండి

  5. దత్త పుత్రుడిని కూడా అరెస్ట్ చేయండి దరిద్రం ఒడిలిద్ది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button