తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Chandrababu: చిక్కుల్లో చంద్ర‌బాబు.. కార‌ణం అత‌డే..?

మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అరెస్ట్‌, ఆంధ్రా రాష్ట్ర రాజ‌కీయాల‌ను కుదిపేసింది. త‌న‌పై అనేక ఆరోప‌ణ‌లు వ‌చ్చినా, చాలా తెలివిగా త‌ప్పించుకునే చంద్ర‌బాబు, ఫ‌స్ట్ టైమ్ ఊహించ‌ని చిక్కుల్లో ఎలా ఇరుక్కున్నాడనేది, సామాన్య‌లు నుంచి రాజ‌కీయ మేధావుల‌ను సైతం వెంటాడుతున్న మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

స్కిల్ కుంభ‌కోణంలో చంద్ర‌బాబు ఇరుక్కోవ‌డానికి కార‌ణం ఒకే ఒక్క‌డు అనే టాక్ వినిపిస్తుంది. చంద్ర‌బాబు హ‌యాంలో ఫైనాన్స్‌ సెక్రటరీగా విధులు నిర్వ‌ర్తించిన పీవీ ర‌మేష్‌, అప్రూవ‌ర్‌గా మారి ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో స్కిల్ డెవ‌లెప్‌మెంట్ స్కామ్ భాగోతాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో మొత్తం స్కిల్‌ స్కామ్‌ ఎపిసోడ్‌లో పీవీ ర‌మేష్ అత్యంత కీలకంగా మారారు.

నాడు ఏపీలో టీడీపీ ప్ర‌భుతం అధికారంలో ఉన్న‌ప్పుడు, ఫైనాన్స్‌ సెక్రటరీగా ఉన్న పీవీ రమేష్‌, సీమెన్స్‌కి నిధులు విడుదల చేసేందుకు నిరాకరించడ‌మే కాకుండా, అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని వారించడంతో పాటు, ఇదే విష‌యాన్ని ఆయ‌న అప్ప‌టి సీఎస్‌కు లేఖ కూడా రాశాన‌ని పీవీ ర‌మేష్ సీఐడీ విచారణలో భాగంగా స్టేట్‌మెంట్ ఇచ్చారు.

అయితే చంద్ర‌బాబు అధికారుల‌పై ఒత్తిడి చేశార‌ని, ఆయ‌న ఆదేశాలతోనే సీమెన్స్‌కి ప్ర‌భుత్వ‌ నిధులు విడుదల చేసినట్టు సీఐడీకి వాంగ్మూలం ఇచ్చారు పీవీ ర‌మేష్. ఇదే విషయాన్ని మాజీ ఛీప్ సెక్ర‌ట‌రీ ఐవీఆర్ కృష్ణారావు కూడా చెప్పిన‌ట్లు టాక్. ద‌ర్యాప్తులో భాగంగా షెల్‌ కంపెనీల లింక్‌లు, గోల్‌మాల్ అయిన‌ ముడుపుల‌కు సంబంధించిన కీల‌క‌ ఆధారాలను సేక‌రించిన‌ సీఐడీ, చంద్ర‌బాబును అరెస్ట్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button