తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Chandrababu Arrest: తేల్చేసిన సురేష్.. త‌మ్ముళ్ళూ మీకు అర్థ‌మ‌వుతోందా..?

విష‌యం లేన‌ప్పుడే ప్ర‌చారం పీక్స్‌లో ఉంటుంద‌ని ఓ పెద్దాయ‌న చెప్పిన‌ట్టు, వేదిక ఏదైనా సొంత డ‌బ్బా కొట్టుకోవ‌డంలో చంద్ర‌బాబు, మిస్ట‌ర్ డ‌ప్పు భ‌జ‌న చేయ‌డంలో టీడీపీ త‌మ్ముళ్ళ‌కు మించిన వాళ్ళు లేర‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు అభివృద్దికి చంద్ర‌బాబు చాల చేశార‌ని, ఇప్పుడు టాలీవుడ్‌కు జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావ‌డానికి, బాబే కార‌ణ‌మ‌ని గొప్ప‌లు చెప్ప‌కుంటారు టీడీపీ తమ్ముళ్ళు.

మ‌రి అలాంటి చంద్ర‌బాబు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే, టాలీవుడ్ నుంచి ఎంత‌మంతి స్పందించారు అనేది ఇప్పుడు మీడియ వ‌ర్గాల్లో హాట్ టాపిక్. బాబు గారు నిజంగానే తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చాలానే చేస్తే, లాజిక్ ప్ర‌కారం మొత్తం ఇండ‌స్ట్రీ నుంచి ఖండ‌న రావాలిగా, కానీ రాఘ‌వేంద్ర‌రావు, ముర‌ళీ మోహ‌న్, అశ్వినీ ద‌త్.. లాంటి న‌లుగురు సినీ పెద్ద‌లు మాత్ర‌మే స్పందించగా, మిగ‌తా సినీ జ‌నాలంతా సైలెంట్‌గానే ఉన్నారు.

అయితే తాజాగా ఓ సినిమా వేదిక‌లో భాగంగా, చంద్ర‌బాబు అరెస్ట్ పై ఫిల్మ్ ఇండ‌స్ట్రీ ఎందుకు మౌనంగా ఉంద‌ని, ప్ర‌ముఖ నిర్మాత ద‌గ్గుబాటి సురేష్ బాబును ప్ర‌శ్నించాయి మీడియా వ‌ర్గాలు. ఆ ఇష్యూపై చిరుకుగానే స్పందించిన సురేష్ బాబు.. కొంద‌రి క‌ళ్లు తెరిచేలా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలుగు సినీ పరిశ్రమ రాజకీయాలకు, మతపరమైన అంశాలకు ఎప్పుడూ దూరంగానే ఉందని తెలిపారు. ముక్యంగా సెన్సిటివ్ విషయాలపై చిత్ర పరిశ్రమ నుంచి స్పందన ఉండదన్నారు.

గ‌తంలో తెలంగాణ, ఆంధ్ర విభ‌జ‌న‌ విషయంలోనూ సినీ పరిశ్రమ స్పందించలేదని, మేము మూవీ మేక‌ర్స్, సినిమాలు మాత్రమే తీస్తామ‌ని, ప్ర‌తి ఇష్యూ పై తాము స్పందిచ‌లేమ‌ని, చంద్ర‌బాబు అరెస్ట్‌ను చాలా లైట్ తీసుకున్నారు సురేష్ బాబు. టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి చంద్ర‌బాబు చాలానే చేశార‌నే అంశంపై మాట్లాడుతూ, తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఎన్టీఆర్, చెన్నారెడ్డిల నుంచి చంద్ర‌బాబు వ‌ర‌కు చాలా మంది చాలా చేశారన్నారు. ముఖ్యంగా చంద్ర‌బాబు అరెస్ట్‌పై, మొత్తం ఇండ‌స్ట్రీ నుంచి ఖండ‌ల‌ను, ప్ర‌క‌ట‌ణలు ఆశించొద్ద‌ని, ఆయ‌న‌పై సింప‌తీ ఉండేవాళ్ళ‌కు ఉంటుంద‌ని, మిగ‌తా వాళ్ళ నుంచి ఆశించొద్ద‌ని సురేష్ బాబు తేల్చి చెప్పారు. దీంతో ఇప్ప‌టికైనా టీడీపీ త‌మ్ముళ్ళ క‌ళ్లు తెరుచుకుంటాయో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button