తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Chandrababu Arrest: నా స్వామిరంగ.. హైలెట్ మాత్రం బొడ్డులో డైరెక్ట‌రే..!

చంద్ర‌బాబు అరెస్ట్, ఆంధ్రా రాజ‌కీయవ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్న మాట వాస్త‌వం. అస‌లు చంద్ర‌బాబు అరెస్ట్ ఎవ‌రూ ఊహంచలేదు. స్కిల్ స్కామ్‌లో చిన్న తీగ లాగ‌గా, టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో, ఏపీలో జ‌రిగిన భాగోతాలన్నీ ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ముఖ్యంగా ఈసారి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముందు చంద్ర‌బాబు సిత్రాలు ప‌నిచేయ‌లేదు. చివ‌రికి అరెస్ట్ అయ్యి జైలా.. బెయిలా అనే సిట్యువేష‌న్‌లో ఉన్నాడు 40 ఇయ‌ర్స్ చాణ‌క్యుడు.

ఇక చంద్ర‌బాబు అరెస్ట్‌తో, వైసీపీ ప్ర‌భుత్వం పై టీడీపీ త‌మ్ముళ్ళు ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాడు. దానిని వైసీపీ నాయ‌కులు కూడా ధీటుగానే కౌంట‌ర్లు ఇస్తున్నార‌నుకోండి. అయితే ఇప్పుడు తాజాగా టాలీవుడ్ వెట‌ర‌న్ డైరెక్ట‌ర్, కె. రాఘవేంద్ర‌రావు రియాక్ష‌న్ మాత్రం సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోల్ అవుతుంది. ఒక విజనరీ లీడర్ అయిన చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికమ‌ని చెప్పారు రాఘ‌వేంద్ర‌రావు. అంత వ‌ర‌కు బాగానే ఉంది, కానీ ఆ త‌ర్వాత ఏపీలో ఉన్నఅంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా, తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయంటూ తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. దీంతో సోష‌ల్ మీడియాలో ఈ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడిని ఆడేసుకుంటున్నారు.

చంద్ర‌బాబు నిప్పుకాదు, తుప్పు అని, రాష్ట్రంలోనే పెద్ద అవినీతిప‌డు అని సాక్ష్యాల‌తో స‌హా నిరూప‌ణ జ‌రిగితే, ఈ బొడ్డులో డైరెక్ట‌ర్ మాత్రం చిల‌క్కొట్టుడు వ్యాఖ్య‌లు చేస్తున్నాడ‌ని, సోష‌ల్ మీడియాలో రాఘ‌వేంద్ర‌రావును ఉతుకుతున్నారు నెటిజ‌న్లు. నీ సినిమాల్లో హీరోయిన్ల బొడ్డు పై పూలు, పండ్లు వేసినంత ఈజీగా, చంద్ర‌బాబు రాజ్యాంగానికి ఎప్పుడో మ‌కిలీ ప‌ట్టించాడ‌ని జ‌నాలు చివాట్లు పెడుతున్నారు. ప్ర‌జ‌ల సొమ్ము లూఠీ చేసీ, చంద్ర‌బాబు అరెస్ట్ అయితే ..అంబేద్క‌ర్ విగ్రహాలు ఎందుకు బాధ‌ప‌డుతాయి… బొడ్డుమామా అంటూ చాకిరేవు పెడుతున్నారు. దీంతో చంద్ర‌బాబు అరెస్ట్ పై ఎంతో మంది స్పందించారు కానీ, రాఘ‌వేంద్ర‌రావు సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసిన కామెంట్స్ మాత్రం ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button