తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Growth Hub: వైజాగ్ కు మహర్దశ.. గ్రోత్ హబ్ లో చోటు

ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖపట్టణానికి (Visakhapatnam) మహర్దశ పట్టనుంది. కేంద్ర ప్రభుత్వం వైజాగ్ (Vizag)పై సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రోత్ హబ్ ప్రోగ్రామ్ (Growth Hub Program)లో విశాఖకు చోటు కల్పించింది. దీంతో నగరం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

Also Read షర్మిల ఇంట పెళ్లి సందడి.. వివాహం ఎప్పుడంటే..?

కేంద్ర ప్రభుత్వం ఇటీవల అభివృద్ధి (Development) చెందాల్సిన నగరాల జాబితాను విడుదల చేసింది. గ్రోత్ హబ్ ప్రోగ్రామ్ అని కొత్తగా తీసుకువచ్చింది. ఈ ప్రోగ్రామ్ కింద దేశంలోని ముంబై, వారణాసి, సూరత్ తోపాటు వైజాగ్ ను కూడా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రోత్ హబ్ ప్రోగ్రామ్ లో వైజాగ్ కు చోటు కల్పించింది. ఈ క్రమంలో కాబోయే రాజధానికి ప్రత్యేక నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది.

వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా గ్రోత్ హబ్ ప్రోగ్రామ్ ను నీతి ఆయోగ్ (NITI Aayog) చేపట్టింది. ఆర్థికంగా దేశానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న నగరాల్లో భాగంగా ఆ నాలుగు సిటీలను నీతి ఆయోగ్ ఎంపిక చేసింది. 2047లో ఆర్థిక శక్తిగా భారత్ నిలబడాలనే లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే దేశంలోని ప్రధాన నగరాలను బలోపేతం చేయాలని భావిస్తోంది.

Also Read కాంగ్రెస్ కు సమయమేది? 10 రోజులకే విమర్శలా?

గ్రోత్ హబ్ ప్రోగ్రామ్ జాబితాలో విశాఖపట్టణం ఒక్కటే ఎంపిక చేయలేదు. విశాఖ కేంద్రంగా పరిసర జిల్లాలు విజయనగరం (Vizianagaram), తూర్పు గోదావరి (East Godavari) జిల్లాల అభివృద్ధికి చర్యలు చేపట్టనుంది. వాయు, జల, భూమార్గాలు కలిగిన వైజాగ్ కు మరింత సహకారం ఇస్తే దేశానికి ఆర్థిక చోదక శక్తిగా ఎదిగే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం జగన్ (YS Jagan) వైజాగ్ ను రాజధానిగా చేసేందుకు కంకణబద్దులయ్యారు. త్వరలోనే రాజధాని తరలింపు జరగనుంది. ఇప్పటికే వైజాగ్ కు పరిశ్రమలు రాబోతుండగా.. ఇప్పుడు గ్రోత్ జాబితాలో చోటు దక్కడంతో వైజాగ్ మరింత అభిృద్ధి చెందనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button