తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ

మూవీ రివ్యూ: కెప్టెన్ మిల్లర్ (తెలుగు)

Pakka Telugu Rating : 2.75/5
Cast : ధనుష్, ప్రియాంక అరుళ్ మోహన్, నివేదితా సతీషన్, శివరాజ్ కుమార్, సందీప్ కిషన్, ఎలాన్గో కుమరవెల్ తదితరులు
Director : అరుణ్ మాథేశ్వరన్
Music Director : జీవీ ప్రకాశ్ కుమార్
Release Date : 25/01/2024

ధనుష్ హీరోగా న‌టించిన త‌మిళ మూవీ కెప్టెన్ మిల్ల‌ర్ సంక్రాంతి కానుక‌గా థియేట‌ర్ల‌లో రిలీజైంది. తెలుగు భాషలో జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా మూవీకి అరుణ్ మాథేశ్వ‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శివ‌రాజ్‌కుమార్, సందీప్‌కిష‌న్ గెస్ట్ రోల్స్ చేశారు. ప్రియాంక అరుళ్ మోహ‌న్ హీరోయిన్‌గా న‌టించింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? అసలు సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

క‌థ‌:

అన‌లీస‌న్ అలియాస్ ఈసా (ధ‌నుష్‌) నిమ్న‌ కులానికి చెందిన యువ‌కుడు. వారి ఊరికి స‌మీపంలోనే ఓ పెద్ద గుడి ఉంటుంది. ఈసా కులానికి చెందిన పూర్వీకులే ఆ గుడిని నిర్మిస్తారు. త‌క్కువ కులానికి చెందిన వార‌నే సాకుతో ఊరివాళ్ల‌కు గుడిలోకి రానివ్వ‌డు ఊరి రాజు. అంట‌రానిత‌నంపై ఈసా అన్న సెంగోల‌న్ (శివ‌రాజ్‌కుమార్‌) శాంతియుత‌పోరాటం చేస్తుంటాడు. కుల‌ వివ‌క్ష‌ను భ‌రించ‌లేక‌పోతాడు ఈసా. గౌర‌వ మ‌ర్యాద‌ల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరుతాడు. అక్క అత‌డి పేరు కెప్టెన్ మిల్ల‌ర్‌గా మారుతుంది. ట్రైనింగ్ పూర్తిచేసుకున్న ఈసాకు ఫ‌స్ట్ డ్యూటీలోనే శాంతియుతంగా పోరాటం చేస్తున్న వంద‌లాది మంది భార‌తీయుల్ని కాల్చిచంప‌మ‌ని బ్రిటీష్ వారు ఆర్డ‌ర్ వేస్తారు. ఈసా కాల్పిచంపిన భార‌తీయుల్లో త‌న అన్న సెంగోల‌న్ కూడా ఉన్నాడ‌ని ఊరివాళ్లు చెబుతారు. మ‌రోవైపు మిల్ల‌ర్ ఊరిలో ఉన్న గుడిలో ర‌హ‌స్యంగా దాచిపెట్టిన విలువైన కిరీటంతో కూడిన ఓ పెట్టెను అక్ర‌మంగా త‌మ దేశానికి త‌ర‌లించ‌డానికి బ్రిటీష్ వారు ప్లాన్ చేస్తారు. వారి ద‌గ్గ‌ర నుంచి మిల్ల‌ర్ ఆ బాక్స్‌ను కొట్టేస్తాడు. ఆ పెట్టెను తీసుకొని సిలోన్‌ పారిపోవాల‌ని అనుకుంటాడు. ఎలాగైనా మిల్ల‌ర్ ద‌గ్గ‌ర నుంచి ఆ బాక్స్‌ను తీసుకోవాల‌ని భావించిన బ్రిటీష్ ఆర్మీ ఆఫీస‌ర్ అత‌డి ఊరి ప్ర‌జ‌లంద‌రిని బంధించి చంపేస్తుంటాడు? ఊరి ప్ర‌జ‌ల్ని కాపాడుకోవ‌డానికి మిల్ల‌ర్ వెన‌క్కి వ‌చ్చాడా? త‌మ‌ ఊరివాళ్లు గుడిలో అడుగుపెట్టాల‌నే త‌ల్లి క‌ల‌ను మిల్ల‌ర్‌ ఎలా నెర‌వేర్చాడు? మిల్ల‌ర్‌పై ప్ర‌తీకారం కోసం ఏడు వంద‌ల మంది బెటాలియ‌న్‌తో వ‌చ్చిన బ్రిటీష్ అధికారిని మిల్ల‌ర్, క‌న్న‌య్య గ్యాంగ్ ఎలా ఎదురించింది. నిజంగానే మిల్ల‌ర్ అన్న సెంగోల‌న్ చ‌నిపోయాడా? వేళ్‌మ‌తి ఈసాను ద్వేషించ‌డానికి కార‌ణం ఏమిటి? జ‌మీందారి వంశానికి చెందిన వేళ్‌మ‌తి పోరాట‌యోధురాలిగా ఎందుకు మారింది? మిల్ల‌ర్ పోరాటానికి కెప్టెన్ ర‌ఫీక్ (సందీప్‌కిష‌న్‌) ఎలా అండ‌గా నిలిచాడు? బ్రిటీష్ వారి నుంచి మిల్ల‌ర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? అన్న‌దే కెప్టెన్ మిల్ల‌ర్ క‌థ‌.

కథనం- విశ్లేషణ:

అంట‌రానిత‌నం, కుల‌వివ‌క్ష‌తో పాటు స‌మాజంలో నిమ్న‌ వ‌ర్గాలు ఎదుర్కొంటున్న అణిచివేత‌ నేప‌థ్యంలో కోలీవుడ్‌లో చాలా సినిమాలొచ్చాయి. రంజిత్‌, వెట్రిమార‌న్‌, మారి సెల్వ‌రాజ్‌తో పాటు ప‌లువురు ద‌ర్శ‌కులు అణ‌గారిన వ‌ర్గాల వారి వెత‌ల‌ను, వ్య‌థ‌ల‌ను ఆవిష్క‌రిస్తూ సినిమాలు చేసి ప్రేక్ష‌కుల్ని మెప్పించారు. అయితే ఈ క‌థ‌ల‌న్నీ స‌మ‌కాలీన స‌మాజ‌పు పోక‌డ‌ల‌ను అద్ధంప‌డుతూ సాగాయి. కానీ కెప్టెన్ మిల్ల‌ర్‌తో ద‌ర్శ‌కుడు అరుణ్ మాథేశ్వ‌ర‌న్ బ్రిటీష్ కాలంలో ఈ కుల‌వివ‌క్ష ఎలా ఉండేది. త‌క్కువ కులం వారిని రాజ‌వంశ‌స్థులు, బ్రిటీష‌ర్లు ఎలా చిన్న‌చూపు చూసేవారు? త‌మ అవ‌స‌రాల కోసం ఏ విధంగా వాడుకున్నార‌న్న‌ది చూపించాడు. గుడిని క‌ట్ట‌డానికి ప‌నికొచ్చిన త‌క్కువ కుల‌స్తులు… గుడిలో అడుగుపెట్ట‌డానికి ఎందుకు అన‌ర్హులుగా మారారు? అనే పాయింట్‌తోనే కెప్టెన్ మిల్ల‌ర్ క‌థ‌ను మొద‌లుపెట్టాడు ద‌ర్శ‌కుడు అరుణ్ మాథేశ్వ‌ర‌న్‌. గుడిలో అడుగుపెట్టాల‌నే వారి క‌ల ఈసా అనే యువ‌కుడి ద్వారా ఎలా నెర‌వేరింద‌న్న‌ది యాక్ష‌న్‌, డ్రామా, దేశ‌భ‌క్తి సోష‌ల్ మెసేజ్ జోడించి సినిమాలో చూపించారు. బ్రిటీష్ బ్యాక్‌డ్రాప్ కెప్టెన్ మిల్ల‌ర్‌కు ప్లస్ గా మారింది. ధ‌నుష్‌లోని హీరోయిజం ఎలివేట్ కావ‌డానికి ఈ బ్యాక్‌డ్రాప్ ను బాగా వాడుకున్నాడు డైరెక్ట‌ర్‌. ఓ ఆంట‌రాని యువ‌కుడిగా జ‌ర్నీ మొద‌లుపెట్టి చివ‌ర‌కు ఊరి ప్ర‌జ‌ల‌ ఇల‌వేల్పు కు ప్ర‌తిరూపంగా మారిన‌ ఈసా ప్ర‌యాణాన్ని భిన్న కోణాల్లో చూపించారు డైరెక్ట‌ర్ అరుణ్ మాథేశ్వ‌ర‌న్‌. బ్రిటీష్ వారి నుంచి గుడికి సంబంధించి పెట్టెను ధ‌నుష్ కొట్టేసే యాక్ష‌న్ ఎపిసోడ్‌, క్లైమాక్స్ ఫైట్‌లోని ఎలివేష‌న్స్ అభిమానుల‌ను మెప్పిస్తాయి. నిమ్న‌వ‌ర్గాల వారిని గుడిలోకి రావ‌ద్ద‌ని ప్రీ క్లైమాక్స్‌లోని ధ‌నుష్ చెప్పే డైలాగ్ ఆలోచ‌న‌ను రేకెత్తిస్తుంది. సోష‌ల్ మెసేజ్‌ను క‌మ‌ర్షియ‌ల్ కోణంలో చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు కొంత లాజిక్ మిస్సయ్యాడు. 1930 బ్యాక్‌డ్రాప్‌లో క‌థ సాగుతుంది. కానీ ధ‌నుష్ స్టైలిష్ బైక్స్‌, గాగూల్స్ వాడ‌టం, ప్ర‌జెంట్ ట్రెండ్ గ‌న్స్ ఉప‌యోగించ‌డం లాజిక్స్‌కు దూరంగా సాగిన‌ట్లుగా అనిపిస్తుంది. ధ‌నుష్, ప్రియాంక అరుళ్‌మోహ‌న్ ట్రాక్ పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు.

నటీనటులు:

ఇక మూవీలో ధ‌నుష్ వ‌న్‌మెన్ షో చేశాడని చెప్పొచ్చు. కుల‌వివ‌క్ష ఎదుర్కొనే యువ‌కుడిగా, దొంగ‌ల‌గ్యాంగ్ మెంబ‌ర్‌గా, పోరాట‌యోధుడిగా భిన్న కోణాల్లో సాగే పాత్ర‌లో జీవించాడు. అత‌డి లుక్ డిఫ‌రెంట్‌గా ఉంది. శివ‌రాజ్‌కుమార్, సందీప్‌కిష‌న్ గెస్ట్ పాత్ర‌ల్లో క‌నిపించారు. క్లైమాక్స్‌లో ధ‌నుష్‌, శివ‌రాజ్‌కుమార్‌, సందీప్‌కిష‌న్ ముగ్గురి ఒకేసారి క‌నిపించే సీన్ బాగా వ‌ర్క్ అ‌వుట్ అయ్యింది. వారి క్యారెక్ట‌ర్స్‌ను క‌థ‌లో భాగం చేసిన తీరు ఆక‌ట్టుకుంటుంది. ప్రియాంక అరుణ్ మోహ‌న్‌, మాళ‌వికా స‌తీష‌న్ ఇద్ద‌రు హీరోయిన్లు ఉన్నా రొమాంటిక్ ట్రాక్‌లు, డ్యూయెట్స్ సినిమాలో ఉండ‌వు. హీరోయిన్లు డీగ్లామ‌ర్ పాత్ర‌ల్లోనే క‌నిపించారు.

సాంకేతిక వర్గం:

ధ‌నుష్ అభిమానుల‌కు కెప్టెన్ మిల్ల‌ర్ విజువల్ ట్రీట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. అందులోని సన్నివేశాలను చక్కగా తెరకెక్కించారు. సినిమాకు జీవీ ప్రకాశ్ అందించిన నేపథ్య సంగీతం బాగా కలిసివచ్చే అంశం. ముఖ్యంగా కిల్లర్ కిల్లర్ అంటూ సాగే సీక్వెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అలాగే కెమెరామెన్ సిదార్థ నుని చిత్రంలోని సన్నివేశాలను చాలా చక్కగా చిత్రీకరించారు. నగూరన్ రామచంద్రన్ చేసిన ఎడిటింగ్ కథకు తోడ్పాటు అందించిందని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్:

క్లైమాక్స్ సన్నివేశాలు

ధనుష్ నటన

మైనస్ పాయింట్స్:

సాగదీసినట్టు నడిచే కథ

చిత్రంలోని హింసాత్మక సన్నివేశాలు

పంచ్ లైన్:

తమిళంలో హిట్ అయిన కెప్టెన్ మిల్లర్.. తెలుగులో అంతగా రాణించదేమో

3 Comments

  1. You really make it seem so easy along with your presentation but I in finding this matter to be
    actually something which I feel I would by no means understand.
    It seems too complex and very broad for me. I am taking a look ahead for your
    next publish, I will try to get the hold of it!

    Here is my homepage vpn special coupon

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button