తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ

మూవీ రివ్యూ: డంకీ (హిందీ)

Pakka Telugu Rating : 3/5
Cast : షారుక్ ఖాన్, విక్కీ కౌశల్, తాప్సీ పన్ను, బొమన్ ఇరానీ, విక్రమ్ కొచ్చార్, అనిల్ గ్రోవర్
Director : రాజ్ కుమార్ హిరాణి
Music Director : ప్రీతమ్, అమాన్
Release Date : 21/12/2023

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్… పఠాన్, జవాన్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత ఆయన నుంచి వస్తున్న మూవీ కావడంతో ప్రేక్షకుల్లో “డంకీ” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచగా… డంకీ మూవీ డిసెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్, రాజ్ కుమార్ హిరాణి ఫిల్మ్స్ అండ్ జియో స్టూడియోస్ బ్యానర్ పై రాజ్ కుమార్ హిరాణి, గౌరీ ఖాన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి రాజ్ కుమార్ హిరాణి దర్వకత్వం వహించగా షారుక్ కి హైట్రిక్ హిట్ లభించిందా? అసలు ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం!

కథ:

హర్డీ (షారుక్ ఖాన్), మన్ను(తాప్సీ), సుఖీ (విక్కీ కౌశల్), బుగ్గు(విక్రమ్ కోచ్చార్), బల్లి (అనిల్ గ్రోవర్) వీళ్లందరూ మంచి ప్రెండ్స్. వీరు పంజాబ్ లో నివసిస్తుంటారు. ముందు మన్ను, బుగ్గు, బల్లి ప్రెండ్స్ గా ఉంటారు. వీరు ఇంగ్లాండ్ వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా వీరికి హర్డీ, సుఖీ కలుస్తారు. ఈ నేపథ్యంలో అందరూ కలిసి ఇంగ్లాండ్ వెళ్లి డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. కానీ వీరికి అక్కడికి వెళ్లెందుకు ఆర్థికంగాను, స్టడీ పరంగాను ఇబ్బందులు ఎదురవుతాయి. అందువల్లే వీరు డంకీ అనే పద్దతిని ఎంచుకుంటారు. డంకీ అంటే అడ్డదారిలో ఇంగ్లాండ్ వెళ్లడం. అయితే వీళ్లు ఆ దారిలో ఇంగ్లాండ్ వెళ్లగలిగారా? ఒకవేళ వెళితే వారు అక్కడ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు ? చివరకు వాళ్లు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారా? అని తెలుసుకోవాలంటే డంకీ మూవీ చూడాల్సిందే!

క‌థ‌నం-విశ్లేషణ:

సూప‌ర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్ స్థాయి మాస్‌కి, ఆయ‌న మార్క్ రొమాంటిక్ ఇమేజ్‌ ఏమాత్రం ప్ర‌భావితం కాకుండా త‌న‌దైన శైలిలోనే క‌థ‌ని మ‌లిచాడు హిరాణీ. ఇంగ్లండ్‌లో క‌థ‌ని మొద‌లుపెట్టిన ద‌ర్శ‌కుడు.. ఆ త‌ర్వాత పంజాబ్‌లోని ప‌ల్లెటూరిలో ప్రేక్ష‌కుల్ని లీనం చేస్తాడు. మ‌న్ను, బుగ్గు, బ‌ల్లిల కుటుంబ నేప‌థ్యాలను, ఆ ఊరికి హార్డీ సింగ్ రావ‌డానికి గ‌ల కార‌ణాన్ని ఆవిష్క‌రిస్తూ స‌న్నివేశాల్ని మ‌లిచాడు. వాళ్లంతా క‌లిశాక వీసా ప్ర‌య‌త్నాలు, ఇంగ్లిష్‌ నేర్చుకోవ‌డం, డంకీ రూట్లో ఇంగ్లండ్‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం వంటి స‌న్నివేశాల‌తో ప్ర‌థ‌మార్ధం సాగుతుంది. అందరూ కలిసి ఇంగ్లాండ్ వెళ్లలని నిర్ణయించుకోవడంతో పస్టాఫ్ కి ముగుస్తుంది.

ద్వితీయార్ధంలో డంకీ ప్ర‌యాణంలో ఎదుర‌య్యే స‌వాళ్లు కీల‌కం. వ‌లస‌దారుల పరిస్థితులు ఎంత ద‌య‌నీయంగా ఉంటాయో, ఎన్ని సాహ‌సాలు చేయాలో, వెళ్లాక విదేశాల్లో వారి బ‌తుకులు ఎంత దుర్భరంగా ఉంటాయో చూపించిన తీరు ఆక‌ట్టుకుంది. హార్డీ, మ‌న్ను ప్రేమ‌క‌థ ఆక‌ట్టుకుంటుంది. ప‌తాక స‌న్నివేశాల్లోనూ ఆ జంట మ‌ధ్య సాగే ప్రేమ‌ నేప‌థ్యం క‌న్నీళ్లు పెట్టిస్తుంది. క‌థలోని భావోద్వేగాలు, సునిశిత హాస్యం ఆక‌ట్టుకున్నా.. క‌థ‌నంలో పెద్ద‌గా మేజిక్ క‌నిపించ‌దు. ప్రేక్ష‌కుడి ఊహ‌కు త‌గ్గ‌ట్టుగా సాగే ఈ క‌థ‌.. త‌ర్వాత ఏం జ‌రుగుతుందనే ఆస‌క్తిని రేకెత్తించదు.

న‌టీ-న‌టులు:

పఠాన్, జవాన్ వంటి యాక్షన్ మూవీస్ తర్వాత ఓ సందేశాత్మక ప్రేమ కథను ఎంచుకోవడం ఓ సహసమనే చెప్పాలి. ఇందులో షారుక్ సఫలం అయినట్టే కనిపిస్తుంది.
షారుక్ ఖాన్ హర్డీ పాత్రలో ఒదిగిపోయాడు. షారుక్ మార్క్ నటన కనబరిచాడు. తాప్సీ కి మంచి క్యారెక్టర్ ఈ సినిమాలో లభించింది. ఒక రకంగా చెప్పాలంటే షారుక్ కంటే మంచిగా నటించింది. విక్కీ కౌశల్ కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. ఇక మిగిత ప్రెండ్స్ క్యారెక్టర్స్, సినిమాలో కనిపించిన మిగితా నటినటులు వారి పాత్ర మేరకు నటించారు. బొమనీ ఇరానీ ఇందులో టీచర్ క్యారెక్టర్ చేయగా ఆయన ఉన్నంత వరకు మంచి నటనను కనబరిచారు.

సాంకేతిక వర్గం:

రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్, రాజ్ కుమార్ హిరాణి ఫిల్మ్స్ అండ్ జియో స్టూడియోస్ నిర్మించిన డంకీ నిర్మాణం ఉన్నతంగా ఉంది. ప్రీతమ్, అమాన్ సంగీతం అందించగా పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాకు రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వం వహించగా ఆయన మార్క్ కామెడీ కనిపించిన ఇంతకు ముందు సినిమాలతో పోల్చితే అంతగా ఆకట్టుకోలేదు. ఎడిటింగ్ పరంగా పర్వాలేదనిపిస్తుంది. మొత్తం మీద డంకీ సాంకేతికంగా ఉన్నతంగా ఉంది.

ప్లస్ పాయింట్స్:

కామెడీ

లవ్ స్టోరీ

తాప్సీ నటన

మైనస్ పాయింట్స్:

సెకండాఫ్ నెమ్మదిండం

యాక్షన్ సన్నివేశాలు లేకపోవడం

పంచ్‌లైన్: రాజ్ కుమార్ మార్క్ కామెడీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button