తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ

మూవీ రివ్యూ: సైంధవ్

Pakka Telugu Rating : 3/5
Cast : విక్టరీ వెంకటేష్, శ్రద్దా శ్రీనాథ్, ఆర్య, ఆండ్రియా, రుహాని శర్మ, నవాజుద్దీన్ సిద్దిఖీ, జిషు సేన్ గుప్తా, ముఖేష్ రిషి, జయప్రకాశ్ తదితరులు
Director : శైలేష్ కొలను
Music Director : సంతోష్ నారాయణన్
Release Date : 13/01/2024

విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో 75వ చిత్రంగా తెరకెక్కిన మూవీ ‘సైంధవ్’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా శనివారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు హిట్, హిట్ 2 ఫేమ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించగా..నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ బోయినపల్లి నిర్మించారు. ఇందులో హీరోయిన్‌గా శ్రద్దా శ్రీనాథ్ నటించింది. కంటెంట్‌‌పై ఉన్న నమ్మకంతో మేకర్స్ సంక్రాంతి బరిలోకి ‘సైంధవ్’ని దింపారు. వెంకటేష్ 75వ సినిమా కావడం, ట్రైలర్, టీజర్‌, ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్‌లో చేయడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. మరి విక్టరీ వెంకటేష్ సైకోగా ఏ మేర ఆకట్టుకున్నాడు? సంక్రాంతి బరిలో ఉంటుందా? అనే విషయాలను తెలుసుకుందాం.

కథ:

‘చంద్రప్రస్థ’ అనే ఓ ప్రాంతంలోనే సినిమా ఉంటుంది. ఇక్కడ ఓ పోర్టులో సైంధవ్‌(వెంకటేష్) క్రేన్ ఆపరేటర్‌గా పనిచేస్తుంటాడు. అంతకుముందు ఓ బిజినెస్ మాఫియాలో పనిచేసి బయటకు వచ్చిన వెంకటేష్.. తన భార్య చనిపోవడంతో అన్ని వదిలేసి తన పాప గాయత్రితో(బేబీ సారా) కలిసి అదే ప్రాంతంలో నివసిస్తుంటాడు. కాగా, అదే కాలనీలోనే భర్తకు విడాకులు ఇచ్చి ఉంటున్న మనో(శ్రద్ధ శ్రీనాధ్) సైంధవ్, గాయత్రికి దగ్గరవుతుంది. ఈ సమయంలో పాప కోసం ఓ మంచి పాఠశాలలో అడ్మిషన్ తీసుకుంటారు. తర్వాత పాఠశాలకు వెళ్లిన వెంకటేష్‌ను కలిసేందుకు వస్తున్న పాప.. సడెన్‌గా పడిపోతుంది. వెంటనే బస్సులో ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్ మెంట్ ప్రారంభించగా.. పాపకు స్పైనల్ మస్క్యులార్ అట్రోఫీ జబ్బు ఉందని తెలుస్తుంది. ఈ అరుదైన వ్యాధి తగ్గాలంటే ఒక్క ఇంజెక్షన్ అవసరమని, దీని విలువ రూ. 17 కోట్లు ఉంటుందని వైద్యులు చెబుతారు. దీంతో వెంకటేష్ ఆ ఇంజక్షన్ ఎలా తీసుకొస్తాడు? పాప బతుకుతుందా? ఈ వ్యాధితో ఆ ప్రాంతంలో ఇంకా ఎంతమంది ఉన్నారు? ఆ పిల్లలను బతికించేందుకు ఏం చేశాడు? అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

క‌థ‌నం-విశ్లేషణ:

వెంకటేష్‌కు తెలుగులో ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఎమోషనల్, యాక్షన్ చిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు. తాజాగా వచ్చిన సైంధవ్ కూడా అలాంటిదే. ఇందులో హీరోకు సైకోగా పిలవడం కొత్తగా అనిపించింది. కానీ సినిమాలో మాత్రం అంతకంటే పెద్ద సైకోయిజంలా సన్నివేశాలు కనిపించాయి. సినిమాలో వెంకటేష్ లుక్ ఆకట్టుకుంది. ఫస్ట్ ఆఫ్‌లో ఓ పది నిమిషాలు నెమ్మదించిన ఆ తర్వాత సినిమా ఇంట్రెస్టింగ్‌గా సాగింది. సైంధవ్ తన పాప మీద చూసిన ప్రేమకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. పాపకు జబ్బు ఉందని తెలియడంతో వెంకటేష్ పడుతున్న ఇబ్బంది, ఎమోషనల్ కంటతడి పెట్టిస్తాయి. కథకు తగినంతగా యాక్షన్ ఫైట్స్ చిత్రీకరణ కోసం డైరెక్టర్ బాగానే శ్రమించారు. ఇక కంటెైనర్ల విషయం, వీటిని ఎవరికి తెలియకుండా దాచిపెట్టిన విధానం, ఆ తర్వాత మళ్లీ ఆ రౌడీ గ్యాంగ్‌ వద్దకు వెళ్లిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. చివరి ఇరవై నిముషాలు ఓ పక్క పిల్లల ఎమోషన్ చూపిస్తూనే మరో పక్క స్టైలిష్ యాక్షన్ సీన్స్ సాగుతాయి. అయితే అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు క్లారిటీగా లేకపోవడంతో పాటు కామెడీ మిస్ కావడంతో కొంత నిరుత్సాహ పడతారు.

న‌టీ-న‌టులు:

వెంకటేష్ సింగిల్‌గా సినిమాను తీసుకెళ్లినట్లు అనిపించింది. ఎందుకంటే సినిమా మొత్తం సైంధవ్ చుట్టూ తిరుగుతుంది. అయితే ఒక పక్క బాధతో మరోపక్క యాక్షన్ సీన్స్‌లో విక్టరీ సాధించాడు. ముఖ్యంగా ఎమోషనల్, లవ్ సన్నివేశాల్లో తన నటనతో మెప్పించాడు. ఇక శ్రద్ద శ్రీనాధ్ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. పాపకు దగ్గరైన తీరు, హుందాతనం బాగుంది. విలన్ పాత్రలో బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న నటుడు నవాజుద్దీన్ సిద్ధికి ఒక రేంజ్‌లో ఆకట్టుకున్నాడు. డాక్టర్ పాత్రలో రుహాణి శర్మ, లేడీ విలన్ గా ఆండ్రియా, తమిళ నటుడు ఆర్య సైంధవ్‌ కి హెల్ప్ చేసి వెళ్లే పాత్రలో పర్వాలేదనిపించారు. శ్రద్ద శ్రీనాధ్‌తో విడాకులు తీసుకున్న గెటప్ శ్రీను కొంత కామెడీని పండించాడు.

సాంకేతిక వర్గం:

సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సంతోష్ నారాయణన్ ఇచ్చిన ఎమోషనల్ సీన్స్, బుజ్జికొండవే సాంగ్ మ్యూజిక్ కంటతడి పెట్టించేలా ఉన్నాయి. మణికందన్ సినిమాటోగ్రఫీ స్టైలిష్‌గా ఉంది. వెంకటేష్ లుక్ కొత్తగా అనిపించింది. డైరెక్టర్ శైలేష్ కొలను మంచి కెంటెంట్ ఎంచుకొని నమ్మకంతో తీశాడు. అయితే అక్కడక్కడ కొన్ని సీన్స్ నమ్మేలా లేవు. ఫైట్స్ డిజైన్ చేసిన తీరు బాగుంది. ఈ సినిమా కోసం ‘చంద్రప్రస్థ’ అనే ఫిక్షనల్‌ టౌన్‌ ఆలోచన చేయడం డైరెక్టర్ సాహసమే అని చెప్పాలి.

ప్లస్ పాయింట్స్:

వెంకటేష్ నటన

ఫైట్స్ డిజైన్

బీజేఎం

మైనస్ పాయింట్స్:

ఫస్ట్ ఆప్‌లో సాగదీత

కన్విన్సింగ్‌గా లేని సీన్స్

పంచ్‌లైన్: డాటర్ సెంటిమెంట్‌తో స్టైలిష్ ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎంటైర్‌టైనర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button