తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Fighter: ఓటిటిలోకి వచ్చేస్తున్న కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

బాలీవుడ్ స్టార్ హ్రితిక్ రోషన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ఫైటర్. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్బంగా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ రిలీజ్ కు ముందు మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఫైటర్ సినిమా రిలీజ్ తరువాత ఆ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా ఈ ఇయర్ ఫస్ట్ డిజాస్టర్ మూవీగా నిలిచింది. అయినప్పటికి.. బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ.270 కోట్లు కలెక్ట్ చేసి సత్తా చాటింది ఈ మూవీ.

Also read: Pawan Kalyan: ఆగిపోయిన హరి హర వీరమల్లు.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీం

ఇక ఫైటర్ సినిమా థియేట్రికల్ రన్ ముగియడంతో ఈ సినిమాను OTTలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం వచ్చే నెల మార్చి 21 నుండి ఫైటర్ సినిమాను స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉందట. ఇదే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. దీంతో ఓటీటీ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక థియేటర్స్ లో అంతంగా ఇంపాక్ట్ చూపించని ఫైటర్ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ ను దక్కించుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button