తెలుగు
te తెలుగు en English
సినిమా

Samantha: బాలీవుడ్ ట్రెండింగ్.. స‌మంత ఇది నిజ‌మేనా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్‌గా ఖుషీ మూవీతో ఇటీవ‌ల తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మయోసైటిస్ నుండి కోలుకున్నా, సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రంగా బాధిస్తుండ‌డంతో, అమె ట్రీట్‌మెంట్ కోసం అమెరికాకు వెళ్ళింది. దీంతో కొన్నాళ్ళు సినిమాల‌కు బ్రేక్ ఇస్తున్నాన‌ని, స్వ‌యంగా చెప్పింది స‌మంత‌. అయితే తాజాగా బాలీవుడ్ మీడియాల్లో స‌మంత పేరు మారుమోగిపోతుంది.

అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. స‌ల్మాన్ ఖాన్, క‌ర‌ణ్ జోహార్ నిర్మాత‌గా ఓ భారీ సినిమా సెట్ అయ్యింది. విష్ణు వ‌ర్థ‌న్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కబోతున్న‌ ఆ సినిమాలో, స‌మంత‌ను హీరోయిన్‌గా తీసుకోనున్నార‌ని, బీటౌన్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్‌కు జోడీగా సౌత్ బ్యూటీ నయనతార న‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఆ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ అవ‌డంతో, అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ.. సల్మాన్ పక్కన సౌత్ హీరోయిన్‌ను పెట్టాలని కరణ్ డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది. పుష్ప మూవీలో స్పెషల్‌ సాంగ్‌తో పాటు, ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్‌తో హిందీ ప్రేక్షకులకు సమంత‌ దగ్గరయింది. దీంతో సామ్ క్రేజ్‌ను యూజ్ చేసుకోవాలని కరణ్ జోహార్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని బాలీవుడ్ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ వార్త నిజ‌మా లేక రూమ‌రా అనేది తెలియాలంటే, మేక‌ర్స్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button