తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: చంద్రబాబు మరీ దిగజారిపోయాడు.. ధర్మాన్ని గెలిపించండి

విశ్వసనీయత ఒకవైపు, మోసం మరోవైపు..రెండింటిలో మీరు దేనివైపో ఆలోచించి ధర్మాన్ని గెలిపించాలని వైసీపీ అధినేత, సీఎం జగన్ ప్రజలను కోరారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సాగిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా ఏడవ రోజు ఆయన చిత్తూరు జిల్లా పూతలపట్టులో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. రానున్న ఎన్నికలు జగన్, చంద్రబాబు మధ్య కాదని, ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమని వెల్లడించారు. ఈ యుద్ధంలో నేను ప్రజల పక్షం అని చెప్పడానికి గర్వపడుతున్నానని చెప్పారు.

ALSO READ: కదం తొక్కిన మహిళా లోకం.. మళ్లీ జగనన్నే రావాలని నినాదాలు

చంద్రబాబు మరీ దిగజారిపోయాడు

చంద్రబాబు రానున్న ఎన్నికల్లో గెలిచేందుకు దిగజారుడు రాజకీయాలకు సిద్ధపడుతున్నాడు. ఎన్నికల్లో తలపడి వైసీపీతో గెలవడం అసాధ్యమని, నేరుగా నన్ను ఢీకొట్టలేక వలంటీర్లను అడ్డుకునేందుకు పన్నాగం వేశాడన్నారు. చంద్రబాబు కుట్రలతో అవ్వాతాతలు విలవిలలాడుతున్నారు. ఎన్నికల సంఘంపై తమ అనుకూలంగా ఉన్న వారితో ఒత్తిడి తెచ్చి పింఛన్ల పంపిణీ చేయనీయకుండా వలంటీర్లను అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో అవ్వాతాతలు, ఇతర పింఛన్‌ లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవ్వాతాతల ఉసురు చంద్రబాబుకు తగులుతుందని, చేయాల్సిందంతా చేసి టీడీపీ నేతలు ఇప్పు­డు డ్రామాలు ఆడుతున్నారని నిప్పులు చెరిగారు.

ALSO READ: పవన్ కల్యాణ్ సినిమాల్లోనే హీరో.. రియల్ లైఫ్‌లో కాదు!

ఓటుతోనే తలరాతలు మారుతాయ్..

ఓటుతో మన తలరాతలు మారతాయని, ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి విషయం చెప్పాలనన్నారు. చంద్రబాబు నాయుడు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్లీ అబద్ధం, మోసం చేసే వారిని రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఎన్నికల సంగ్రామంలో అబద్ధాన్ని, మోసాన్ని మట్టి కరిపించడానికి నేను సిద్ధం. మరి మీరంతా కూడా సిద్ధమా..? అనే వ్యాఖ్యలకు ప్రజలందరూ సిద్ధమేనంటూ సెల్‌లో టార్చ్‌ లైట్‌ ఆన్‌ చేసి చూపించారు. అలాగే ప్రతి ఇంట్లో నుంచి స్టార్‌ క్యాంపెయినర్లును బయటకు వచ్చి జరిగిన మంచి గురించి ప్రతి ఒక్కరూ మరో వంద మందికి చెప్పి రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కేలా చూడాలని కోరారు.

One Comment

  1. తిరువూరు, (నియోజకవర్గ ) గంపలగూడెం మండలం (MD) గుళ్ళపూడి (vi)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button