తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: ఏపీలో ‘ఓట్ ఫ్రం హోం.. ఎవరెవరికి అవకాశమంటే?

ఏపీలో ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు హడావిడి చేస్తున్నాయి. అభ్యర్థుల జాబితాలు, బహిరంగ సభలతో పార్టీలు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టాయి. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. గతంలో ఓటు వేసేందుకు ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, దివ్యాంగులకు తీపికబురు చెప్పనుంది. ఇక వీరందరి కష్టాలకు ఈసీ చెక్ పెట్టనుంది.

ALSO READ: ఏపీలో కులగణన.. ఏ వర్గాలకు ఎంతమేర లాభం?

ఈసీ సరికొత్త విధానాలకు శ్రీకారం..

రాష్ట్రంలో ఎన్నికల వేళ ఈసీ సరికొత్త విధానాలకు శ్రీకారం చుట్టనుంది. ఈ నేపథ్యంలోనే ‘ఓట్ ఫ్రం హోమ్’ అనే ఆప్షన్‌ను ఏపీ ఎన్నికల్లో తీసుకురావాలని కసరత్తు చేస్తోంది. అయితే మొదటిసారిగా కర్ణాటక ఎన్నికల్లో ఈ ఓట్ ఫ్రమ్ హోం విధానాన్ని అమలు చేయగా.. విజయవంతం కావడంతో తర్వాత తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అమలు చేశారు. తాజాగా, ఏపీలోనూ అమలు చేయనున్నారు. అయితే.. ఈ ఆప్షన్ కేవలం 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమేనని అధికారులు చెబుతున్నారు.

ALSO READ: త్వరలో టీడీపీ ఖాళీ.. కేశినేని ఆసక్తికర వ్యాఖ్యలు

దరఖాస్తు చేసుకోండిలా?

80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సౌకర్యం కల్పించనున్నారు. వీరితోపాటు 40 శాతం పైగా వైకల్యం ఉన్న వారు కూడా ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పిస్తోంది. అయితే ఇంటి నుంచి ఓటు వేయడానికి ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల నోటిఫికేషన్‌ రావడానికి ఐదు రోజుల ముందే 12డీ ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వీటిని ఎన్నికల సంఘం బృందాలు పరిశీలించి అర్హులైన వారికి ‘ఓట్‌ ఫ్రమ్‌ హోం’కు అవకాశం కల్పించనున్నారు.

7 Comments

  1. Great goods from you, man. I’ve understand your
    stuff previous to and you are just too excellent.
    I actually like what you have acquired here,
    certainly like what you are stating and the way in which you say it.
    You make it enjoyable and you still take care of to keep it wise.
    I cant wait to read far more from you. This is really a terrific website.

    my blog post: vpn coupon code 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button