తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్
Trending

CM YS Jagan: ఒక్కరికైనా సెంట్‌ స్థలం ఇచ్చారా? చేనేత కార్మికులతో జగన్ ముఖాముఖి

వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ చేపట్టిన ‘ మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఉదయం ప్రారంభమైన బస్సుయాత్ర మంగళగిరికి చేరుకుంది. ఈ సందర్భంగా చేనేత కార్మికులతో సీఎం జగన్‌ ముఖాముఖి అయ్యారు. రాజకీయంగా మంగళగిరిలో చేనేతలు ఎక్కువ అని, అందుకే చేనేత మహిళకు టికెట్‌ ఇచ్చామని చెప్పారు. కానీ చంద్రబాబు చేనేత రంగాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. బీసీలు ఎక్కువగా ఉన్న మంగళగిరిలో బీసీకి టికెట్‌ ఇవ్వకుండా చంద్రబాబు ఫ్యామిలే పోటీ చేస్తోందని మండిపడ్డారు. కుప్పంలో కూడా బీసీలే ఎక్కువగా ఉన్నారని, బీసీలకు చంద్రబాబు టికెట్‌ ఇవ్వరని గుర్తుచేశారు.

ALSO READ: జనజాతరను తలపిస్తున్న ‘బస్సు యాత్ర’..14వ రోజు షెడ్యూల్ ఇదే!

మళ్లీ మీరే రావాలి.. స్థలాలు ఇప్పించాలి

చేనేత కార్మికులు తాము పొందిన లబ్ధిని సీఎంతో వివరించారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి చంద్రబాబు అండ్ కో కోర్టుల్లో కేసులు వేసి అన్యాయం చేశారన్నారు. అందుకే జగనన్న మళ్లీ మీరే రావాలి.. మాకు స్థలాలు ఇప్పించి, ఇళ్లు కట్టించి ఇవ్వాలని కోరారు. సీఎం జగన్‌ స్పందిస్తూ.. 54 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యామని, ఇళ్లు ఇవ్వాలని నిర్ణయిస్తే చంద్రబాబు కోర్టుకు వెళ్లారని, పేదలకు ఇళ్లు ఇస్తామంటే అడ్డుకున్నదెవరు? అంటూ మండిపడ్డారు. నేతన్న నేస్తం పథకం కింద రూ.970కోట్లు చేనేత కార్మికులకు అందించామన్నారు. గతంలో చంద్రబాబు పాలనను మీరు చూశారు కదా.. ఒక్క ఇళ్లైనా ఇచ్చారా? అని నిలదీశారు. అందుకే ఎన్నికల్లో మన బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.

ALSO READ: వైసీపీలోకి క్యూ కట్టిన టీడీపీ కూటమి నేతలు..!

బాబుకు ఉన్నంత నెగిటివిటీ లేదు..

58 నెలల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల నుంచి వింటున్నాను అని సీఎం జగన్ అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలకు సూచనలు తీసుకొస్తామని చెప్పారు. చంద్రబాబుకు ఉన్నంత నెగిటివిటీ అనుభవం నాకు లేదన్నారు. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతామని సూచించారు. గతంలో 98 శాతం హామీలను ఎగ్గొట్టారని, కేవలం 2 శాతం హామీలను మాత్రమే నెరవేర్చారన్నారు. చంద్రబాబు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నారని, గత పాలనకు, మన పాలనకు తేడాను మీరే గమనించాలని చెప్పారు. సూపర్‌ సిక్స్‌, సెవెన్‌ అంటూ గతంలో కూడా ముగ్గురు కలిసే వచ్చారని గుర్తు చేశారు.

3 Comments

  1. I should look at this webpage, as my brother advised, and he was entirely right. You have no idea how much time I spent looking for this information, but this post made my day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button