తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Propaganda ఈ ఒక్క విషయంలో జగన్ మారితే సూపర్ సక్సెస్

సంక్షేమం (Welfare), అభివృద్ధిని రెండు కళ్లుగా చేసుకుని పరిపాలన చేస్తున్న సీఎం జగన్ (YS Jagan)కు ప్రజలందరి ఆదరాభిమానం లభిస్తోంది. తన పాలనతో ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచేలా చేస్తున్న సీఎం జగన్ ఒక విషయంలో మాత్రం వెనుకబడి ఉన్నారు. చేసిన పనిని చెప్పుకోవడంలో మాత్రం వెనుకంజలో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం (Telugu Desam Party) చేసినది తక్కువే అయినా గొప్పలు చెప్పుకోవడంలో ముందుంటుంది. కానీ వారి కన్నా ఎంతో మంచి పథకాలు, కార్యక్రమాలు చేస్తున్నా వాటిని ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారు. పచ్చ పార్టీ చేసిన పనుల్లో వీక్ (Weak) ఉన్నా ప్రచారంలో పీక్స్ (Peaks) ఉండడంతో సోషల్ మీడియాలో కొంత టీడీపీకి సానుకూల ప్రభావం ఉంది.

Also Read ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం జగన్ న్యూ ఈయర్ గిఫ్ట్ ఇదే..

కానీ సీఎం జగన్ ఎన్నో వినూత్నమైన పథకాలు (Schemes), కార్యక్రమాలు చేపట్టిన వాటిని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లలేకపోతున్నారు. ప్రధాన మీడియా (Media) మొత్తం వ్యతిరేకంగా ఉన్న సమయంలో సీఎం జగన్ చేసినదానిని మరింత చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎన్నికల సమయం కావడంతో చేసిన పని కన్నా ప్రచారమే ప్రజల ముందు ఉంటుంది. దీంతో సీఎం జగన్ తన వైఖరిని వదిలేసి కొంత మార్కెటింగ్ స్కిల్స్ కూడా అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల మిచౌంగ్ తుఫాను ప్రభావిత ప్రాంతాలను పర్యటించిన దానిని టీడీపీ విస్తృతంగా ప్రచారం చేసుకుంది. వాళ్లు ఫొటోలకు పోజులివ్వడం మినహా అక్కడ చేసిందేమీ లేకపోయినా ప్రచారం భారీగా చేసుకున్నారు. అదే సీఎం జగన్ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధితులకు సత్వర ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకున్నారు. దీనివలన తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరిగింది. కానీ ఈ విషయం అంతగా వెలుగులోకి రాలేదు. వాస్తవంగా ఇద్దరిలో జగన్ పర్యటన ద్వారానే ప్రజలకు న్యాయం జరిగింది. బయటకు మాత్రం చంద్రబాబు పర్యటన మాత్రమే కనిపించింది. వాళ్లు చేసుకున్న ప్రచారం జగన్ చేసుకోలేకపోయారు.

Also Read ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి

ఇలా సీఎం జగన్ చేసిన కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడంలో వెనుకబడి ఉన్నారు. అధికారం చేపట్టిన నాటి నుంచి ఇదే ఉంది. కరోనా సమయంలో దేశంలోనే అత్యుత్తమంగా ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్ ప్రభుత్వమే. కానీ పేరు మాత్రం రాలేదు. ఇక అనేక పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలతో నవ్యాంధ్రను దేశంలో అగ్రస్థానంలో ఉంచేలా సీఎం జగన్ పాలన కొనసాగుతోంది. కానీ ఇదంతా ఎల్లో మీడియా ద్వారా బయటకు కనిపించడం లేదు. ఇక సోషల్ మీడియాలోనూ ఇదే సమస్య ఉంది. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని జనాలకు చెప్పడంలో జగన్ ప్రభుత్వం, పార్టీ వెనుకంజలో ఉంది.

ఇక సీఎం జగన్ వ్యవహారంలోనూ మార్పు రావాల్సి ఉంది. చంద్రబాబులా నాటకాలు ఆడడం.. మార్కెటింగ్ చేసుకోవడం వంటి జగన్ అలవాటు చేసుకోవాల్సి ఉంది. కానీ సీఎం జగన్ కు అలాంటి ప్రచారాలు చేసుకోవడం ఇష్టం లేదు. స్వతహాగా ఉన్నది చేసుకుంటూ వెళ్లడమే సీఎం జగన్ నైజం. ప్రధాన మీడియా ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా ప్రజల మనసులో తనకు చిరస్థానం ఉందనే భావనతో సీఎం జగన్ పెద్దగా ప్రచార కార్యక్రమాలు చేయడం లేదు. మరి ప్రజలు పని చేసే నాయకుడి వైపా? లేదా ఫేక్ ప్రచారం చేసే వ్యక్తి వైపు ఉంటారా అనేది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button