తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Minister Roja: వైఎస్ షర్మిలపై రోజా కామెంట్స్.. ఏ మొహంతో కాంగ్రెస్ లో చేరారని ప్రశ్న

విశాఖ పర్యటనలో ఉన్న మంత్రి రోజా.. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి గమనించాలని.. వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డిని జైలు పాలు చేసిన పార్టీతో చేతులు కలిపి అన్యాయం చేశారని ఆరోపించారు. షర్మిల గారికి సలహా ఇస్తున్నానని, ఇప్పుడు తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి నుండి మనకి రావాల్సిన 6 వేల కోట్లని, ఉమ్మడి ఆంధ్ర హయాంలో ఏపీకి రావాల్సిన లక్ష 80 కోట్ల ఆస్తులు రాబాట్టాలన్నారు. టూర్లు పెట్టి ప్రచారం చేస్తున్నారని, తెలంగాణలో పోరాటం చేస్తా అని చెప్పి కాంగ్రెస్ లో విలీనం ఎందుకు చేశారో షర్మిల చెప్పాలన్నారు.

Also read: BRS Leaders: ఆటోలో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన

ఏపీలో ఏ లబ్ది పొందడానికి కాంగ్రెస్ తరుపున ప్రచారం చేస్తున్నారో షర్మిల వెల్లడించాలని.. ఏ మొహం పెట్టుకొని కాంగ్రెస్ లో మళ్లీ జాయిన్ అయ్యారో చెప్పాలని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. గట్స్‌ ఉన్న నాయకుడు జ‌గ‌న్‌. చంద్రబాబు, లోకేశ్‌, టీడీపీని జాకీలు పెట్టి లేపినా జాకీలు విరిగిపోతున్నాయి తప్పా.. సైకిల్ పనిచేయడంలేదని ఎద్దేవా చేశారు. వయసులో చిన్నవాడైన అమిత్ షా కాళ్ల‌ను చంద్ర‌బాబు పట్టుకోవడం సిగ్గుచేటు. బాబు మా చిత్తూరు జిల్లాలో పుట్టడం సిగ్గుచేటు. అని మంత్రి దుయ్య‌బ‌ట్టారు. అధికారంలోకి రావాలన్న కాంక్షతో కాంగ్రెస్‌తో ఒకసారి, బీజేపీతో ఒకసారి పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఫైరయ్యారు. పొలిటికల్‌గా చంద్రబాబు రోజురోజుకు దిగజారిపోతున్నారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button