తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

BRS Leaders: ఆటోలో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన

ఆటో డ్రైవర్లపై ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో అసెంబ్లీకి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వివేకానంద, మాధవరం కృష్ణారావు, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్… హైదరాబాద్ హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు.

Also read: AP CID: ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం.. వెలుగులోకి చంద్రబాబు అక్రమాలు

మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు. రెండు నెలల్లో 21 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ఆటో కార్మికులను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. డిమాండ్ లేకపోవడంతో 6.5 లక్షల మంది ఆటో కార్మికులు ఈఎంఐ చెల్లించలేక పస్తులుంటున్నారని వెల్లడించారు. చనిపోయిన డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు నెలకు రూ.10 వేల జీవనభృతి కల్పించే విధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో పొందుపర్చాలి.

మండలి సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. కౌన్సిల్ పోడియం వద్ద నిరసన తెలిపారు. నల్ల కండువాలతో నిరసన తెలిపారు. దీంతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. సీఎంపై ఫిర్యాదును అసెంబ్లీ కార్యదర్శికి పంపినట్లు మండలి చైర్మన్‌ తెలిపారు. కాగా, మండలి సభ్యులను ముఖ్యమంత్రి అవమానించారని ఎమ్మెల్సీ భాను ప్రసాద్ అన్నారు. వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. సభా గౌరవాన్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మోతె శోభన్ రెడ్డిని అసెంబ్లీలోకి నల్ల కండువాలు తీసుకువస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. నల్ల కండువాలు ధరించి రావొద్దని చెప్పారు. దీంతో ఎమ్మెల్సీలు, మార్షల్స్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసన తెలపడం తమ హక్కు అని, సస్పెండ్ చేయాలని కోరితే ఎమ్మెల్సీలు భానుప్రసాద్, శోభన్ రెడ్డి, తాతా మధు, మహమూద్ అలీ సభ లోపలికి వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button