తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్రాజకీయం

Skill Scam: బాబ్బాబు.. బాబు కోసం నిరసన చేయండయా!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత, ఏపీ మాజీ చంద్రబాబును పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. నంద్యాల నుంచి ఆయనను విజయవాడకు తరలించారు. అయితే తమ అధినేత అరెస్టును తెలుగు తమ్ముళ్లు లైట్ తీసుకుంటున్నట్టు సమాచారం. అందుకు సంబంధించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిర్వహించిన సమావేశంలోని ఆడియో సాక్ష్యంగా నిలుస్తోంది. నంద్యాలలో అరెస్టైన చంద్రబాబును రోడ్డు మార్గంలో పోలీసులు విజయవాడకు తీసుకువచ్చారు. కానీ ఎక్కడ కూడా పార్టీ నేతలు కానీ, కార్యకర్తలు నిరసన చేస్తూ అడ్డుకోలేదని అచ్చెన్నాయుడు అసహనం వ్యక్తం చేశారు.

అలాగే కృష్ణా జిల్లాకు చెందిన నేతలతో అత్యవసరంగా టెలీ కాన్ఫిరెన్స్ నిర్వహించి పార్టీ పరంగా నిరసనలు, ఆందోళనలు చేయాలని నేతలను రిక్వెస్ట్ చేశారు. కనీసం మహిళా కార్యకర్తలను తీసుకొని వచ్చైనా నిరసనలు చేయాలని.. సూచించారు. చంద్రబాబు అరెస్టును ప్రజలు పెద్దగా పట్టించుకోవటంలేదని, పైగా చంద్రబాబు ఎలాంటి చాణిక్యుడో ప్రజలకు తెలుసునని తనకు ఫోన్లు చేసి నేతలు చెప్తున్నట్టు తెలిపారు. ఇక ఇప్పటికైనా ఆందోళనలు ఉధృతం చేయాలని కోరారు. ప్రస్తుతం ఆ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button