తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

YCP: సంచలన సర్వే.. మళ్లీ వైసీపీదే అధికారం!

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ-జనసేన కూటమి ఎన్నికల రణరంగంలోకి దూకేశాయి. ‘వై నాట్ 175’ నినాదంతో వైసీపీ అన్ని పార్టీల కంటే ప్రచారంలో వేగంగా దూసుకెళ్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 8 విడతలుగా అభ్యర్థులను ప్రకటించిన ఆయన.. మరికొన్ని రోజుల్లోనే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇక, ప్రచారంలోనూ సీఎం జగన్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ‘సిద్ధం’ సభలతో అందర్నీ ఆకట్టుకుంటున్నారు. విశాఖపట్నం జిల్లా భీమిలీ, ఏలూరు జిల్లా దెందులూరు, అనంతపురం జిల్లా రాప్తాడులలో నిర్వహించిన ‘సిద్ధం’ సభలకు లక్షలాదిగా హాజరైన జనం మరోసారి జగనే సీఎం కావాలంటూ నినదించారు.

ALSO READ: పవన్ కొత్త నాటకం.. ఆస్తులు అమ్ముతున్నట్లు డ్రామా

19 ఎంపీ స్థానాల్లో విజయ బావుటా!

వైసీపీకే మరోసారి పగ్గాలు అప్పగించేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ ఇదివరకే పలు సర్వేలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇండియా టీవీ, పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్ సంస్థలన్నీ వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ప్రకటించాయి. తాజాగా మరో సర్వే సంస్థ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. జీ న్యూస్- మ్యాట్రిజ్ తాజాగా తన ఒపీనియన్ పోల్‌ను నివేదికను వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ ఒపీనియన్ పోల్‌ను నిర్వహించింది. ఏపీలో వైఎస్ఆర్సీపీ హవా కొనసాగుతుందని, మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉండగా.. వైసీపీ 19 చోట్ల విజయ బావుటా ఎగురవేస్తుందని తెలిపింది. తెలుగుదేశం- జనసేన కూటమి ఆరు స్థానాలకే పరిమితమవుతుందని అంచనా వేసింది.

ALSO READ: చంద్రబాబుకు షాక్.. గొల్లపల్లి సూర్యారావు రాజీనామా

48 శాతం ఓట్లు.. 133 సీట్లు

అంతేకాదు, అసెంబ్లీ నియోజక వర్గాల ఫలితాలను సైతం జీ న్యూస్-మ్యాట్రిజ్ అంచనా వేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 133 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఘన విజయాన్ని అందుకుంటుందని తెలిపింది. ఏపీ ప్రజలు సంక్షేమం- అభివృద్ధి వైపే మొగ్గు చూపారని పేర్కొంది. ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేక పవనాలు వీచట్లేదని స్పష్టంచేసింది. వైసీపీకి 48 శాతం మేర ఓట్లు పోల్ అవుతాయని, టీడీపీ-జనసేనకు 44శాతం లోపే ఓట్లు పోలవుతాయని అంచనా వేసింది.

4 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button