తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Operation Valentine: Sensor పూర్తి చేసుకున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమాకు శక్తిప్రతాప్‌ సింగ్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా.. మాజీ మిస్ యూనివర్స్‌ మానుషి చిల్లర్‌ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజ‌ర్‌తో పాటు ట్రైల‌ర్‌లు ఆకట్టుకున్నాయి. తాజాగా, ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ALSO READ: కన్నప్ప నుంచి కీలక అప్డేట్.. రెండో షెడ్యూల్ ప్రారంభం

యూ/ఏ సర్టిఫికెట్..

ఈ మూవీకి సెన్సార్ స‌భ్యులు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించారు. గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలు. ఇక వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా వ‌స్తుండ‌గా.. పాకిస్తాన్‌లో ఉన్న టెర్ర‌రిస్ట్‌ల‌ను అంతమొందించడానికి ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ చేసే మిష‌నే ఆపరేషన్‌ వాలెంటైన్‌ అని తెలుస్తుంది. ఇందులో మిర్‌ సర్వార్‌, నవదీప్‌ కీలక పాత్రలు పోషిస్తుండగా.. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందించారు.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button