తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Kannappa: కన్నప్ప నుంచి కీలక అప్డేట్.. రెండో షెడ్యూల్ ప్రారంభం

కొన్నేళ్లుగా మంచు విష్ణు హిట్ కోసం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. కానీ, అది మాత్రం విష్ణుకు అందడం లేదు. దీంతో ఈసారి ఎలాగైనా వవిష్ణు మంచి విజయాన్ని అనుకోవాలని కన్నప్పతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. మహా భారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్ వంటి మహామహులెంతో మంది నటిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద మోహన్ బాబు నిర్మిస్తున్నారు. కన్నప్ప సినిమాపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అంచనాలున్నాయన్న సంగతి తెలిసిందే. ఇది వరకు ఎన్నడూ చూడని ఓ దృశ్యకావ్యంగా కన్నప్ప మూవీని తెరకెక్కిస్తున్నారు.

Also read: Game Changer: మళ్లీ వాయిదా పడిన గేమ్ ఛేంజర్.. తాజా రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

న్యూజిలాండ్‌, థాయ్‌లాండ్, ఇండియాకు చెందిన అత్యంత ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, టెక్నిషియన్లతో షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో సినిమాను షూట్ చేస్తున్నారు. ఆల్రెడీ న్యూజిలాండ్‌లో 90 రోజుల పాటు నిర్విరామంగా ఫస్ట్ షెడ్యూల్‌ను కంటిన్యూ చేశారన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక చిత్రయూనిట్ అంతా ఇండియాకు తిరిగి వచ్చింది. కాస్త గ్యాప్ తీసుకున్న కన్నప్ప టీం మళ్లీ ఇప్పుడు సెకండ్ షెడ్యూల్‌ను గ్రాండ్‌గా ప్రారంభించింది. ఈ మేరకు న్యూజిలాండ్‌లో దిగిన విష్ణు మంచు ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో మోహన్ బాబు, విష్ణు మంచు కనిపిస్తున్నారు. ఈ రెండో షెడ్యూల్‌లో ఒళ్లు గగుర్పొడిచే సీన్లను చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాతో విష్ణు హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button