తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

YS Sharmila: చెప్పేది ఒకటి చేసేది మరొకటి… షర్మిల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వైఎస్ షర్మిల కూడా కృషి చేశారు. సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజల్లోకి ఆ పార్టీ వెళ్లడానికి తన వంతు ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత వైఎస్ షర్మిల ఏపీ రాష్ట్రాన్ని వీడి తెలంగాణకు వచ్చి వైఎస్ఆర్టీపీ పార్టీని స్థాపించారు. ఇక్కడ ఇటీవల జరిగిన ఎలక్షన్స్ లో వైఎస్ఆర్టీపీ పోటీ చేస్తుందని మొదట్లో చెప్పిన కాంగ్రెస్ కు మేలు చేయడం కోసం పోటీ నుంచి షర్మిల తప్పుకున్నారు. త్వరలో ఏపీ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షర్మిలతో కాంగ్రెస్ అధిష్టానం పలుమార్లు చర్చలు జరిపి వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ఒప్పించారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించారు.

Also Read: పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం.. అన్ని విధాలా ఆదుకుంటాం

గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు పై విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ కి ఒక అన్న ఉండే వాడని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజా రాజ్యం పార్టీ పెట్టి చివరికి అదే కాంగ్రెస్ పార్టీకి తన పార్టీని హోల్ సేల్ గా అమ్మేశాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కి వెన్నుపోటు పొడించిందని ఆరోపించింది. విలీనం అనే పదం తనకు ఇష్టముండదని తెలిపారు. ఈరోజుల్లో మాట మీద నిలబడే నాయకుడు ఉన్నాడా అని ప్రశ్నించారు. మరి షర్మిల చేసిన పని ఏంటని ప్రజలు నిలదీస్తున్నారు.

Also Read: ఆన్‌లైన్ లో రేషన్ కార్డులు ఇచ్చాం… కానీ ఎవరికి తెలియదు: కేటీఆర్

మరోవైపు తెలంగాణలో పార్టీ స్ధాపించిన తర్వాత తెలంగాణ ప్రజలకు సేవా చేయడానికే తన జీవితాన్ని అంకితం చేస్తానని…తెలంగాణ గడ్డ మీదనే పెరిగి, ఇక్కడే చదువుకున్న, ఇక్కడే పెండ్లి చేసుకున్న కాబట్టి ఈ గడ్డకు సేవా చేసే బాధ్యత, హక్కు రెండు కూడా ఆమెకు ఉన్నాయని చెప్పారు. తమ పార్టీ 119 నియోజకవర్గాలల్లో పోటీ చేసి ప్రభంజనం సృష్టిస్తుందని అప్పట్లో షర్మిల చెప్పారు. కానీ ఇప్పుడు ఆమెనే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. చెప్పేది ఒకటి చేసేది మరొకటి అన్న ఛందంగా షర్మిల తీరు ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: అస్సాంలో రాహుల్ జోడో న్యాయ్ యాత్ర… బీజేపీ కార్యకర్తల దాడి

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజునే షర్మిల స్ట్రాటజీ ఏంటో అర్థమైపోతుంది. సీఎం జగన్ అసలు క్రిస్టియన్ కాదని, దళితులకు అన్యాయం చేస్తున్నాడనే మాటలతో ఆమె ఓట్లు చీల్చాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. సొంత అన్నను పట్టుకొని బయట వాళ్లు పిలిచినట్లు జగన్ రెడ్డి అనడం, చంద్రబాబు ని చంద్రబాబు గారు అనడంలోనే ఇదంతా ఆమెతో ఎవరు చేయిస్తున్నారో అర్థమవుతుంది. ఈ ఓట్లు చీల్చడం అనేది పాలిటిక్స్ ఆఫ్ ఓల్డ్ టెక్నాలజీ. ఇక్కడ ఏపీ ప్రజలకు ఉన్నది రెండే దారులు. ఎవరైతే జగన్ సీఎం కావాలనుకుంటారో వాళ్లు ఆయనకు ఓటు వేసి మళ్లీ సీఎం ను చేయడం లేదంటే చంద్రబాబుకు ఓటు వేసి ఆయనను సీఎం చేయడం అంతేగానీ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశమైతే కనిపించడంలేదు. షర్మిల ఇంకో కేఎ పాల్ అవ్వకపోతే చాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button